ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ... "ఈ చేంజ్ ఎలా సాధ్యం మాకు చెప్పండి? ఆకాశ్ దీప్ పాపం ఏం తప్పు చేశాడు? బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లలో అద్భుతంగా బౌలింగ్ చేసాడు కదా? పిచ్ కండీషన్లు అర్థం చేసుకొని బౌలింగ్ ఉత్తమంగా చేయాలని మీరే చెబుతుంటారు. కానీ, అలాంటి సామర్థ్యం ఉన్న ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టడం ఎంతవరకు సమంజసం? హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకోవడం వెనక ఉద్దేశం ఏమిటి? ఆకాశ్ దీప్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి కదా! అని ప్రశ్నించారు మనోజ్ తివారీ.
ఈ క్రమంలో మనోజ్ తివారీ తన మాటల్ని తాను సమర్ధించుకుంటూ... తానేమీ తప్పుగా మాట్లాడడం లేదని, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నానని అనడం కొసమెరుపు. గతంలో గంభీర్ తన కుటుంబాన్ని దుర్భాషలాడాడని, టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీని గురించి కూడా చెడుగా మాట్లాడాడని ఈ సందర్భంగా ఆరోపించాడు మజోజ్. ఢిల్లీలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గంభీర్‌తో తాను గొడవ పడినప్పుడు అందరూ అతడు చెప్పిన మాటలే విన్నారని వాపోయాడు. గంభీర్ ఏం మాట్లాడిన పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్ గొప్పగా ప్రచారం చేస్తుందని, దాని గురించే తాను మాట్లాడుతున్నానని వివరణ ఇచ్చుకొచ్చాడు.