ఇక షోయబ్ మాలిక్ విషయానికొస్తే.. అతడు మాత్రం పాకిస్తానీ నటి సనా జావేద్‌ను పెళ్లాడేసి లైఫ్‌లో ముందుకు సాగిపోతున్నాడు. సనాకు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. మరోవైపు సానియా కూడా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సానియా మాత్రం ఇంకా నోరు విప్పలేదు. తన భవిష్యత్తు గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు.
సానియాను పెళ్లాడే ఆ టాలీవుడ్ హీరో ఎవరై ఉంటారా అని ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు. ఆ హీరో సింగిలా లేక విడాకులు తీసుకున్నాడా లేక పెళ్లయిందా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. సానియా తన సోషల్ మీడియాలో 'కొత్త జీవితం మొదలుపెడుతున్నా' అంటూ పోస్టులు పెట్టడంతో.. ఆమె రెండో పెళ్లికి రెడీ అవుతోందని నెటిజన్లు ఫిక్సయిపోయారు.
గతంలో సానియా మీర్జా, ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీతో ప్రేమలో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. షమీ తన భార్య హసీన్ జహాన్‌కు విడాకులు ఇచ్చాక సానియాను పెళ్లాడతాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై సానియా కానీ షమీ కానీ ఎప్పుడూ స్పందించలేదు. సానియా మళ్లీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని పాకిస్తానీ నటుడు నబీల్ జాఫర్ లాంటి చాలా మంది ప్రముఖులు కోరుకుంటున్నారు.
ఏదేమైనా సానియా ప్రేమ వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి వార్తలు నిజమవుతాయో లేదో తెలియదు కానీ.. తన జీవితంలో ఈ కొత్త ఫేజ్‌లో సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ ఊహాగానాలపై సానియా క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.