2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సిరీస్‌లోనే దిగ్గజ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో, మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ ఆశించింది. కానీ, ఆస్ట్రేలియా జట్టులోకి ఒక కీలక ప్లేయర్ రీఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఆటగాడే ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్.

మెల్‌బోర్న్, సిడ్నీ వేదికలుగా జరిగిన చివరి రెండు టెస్టుల్లో బోలాండ్ టెరిఫిక్ పర్ఫామెన్స్ కనబరచడంతో ఆస్ట్రేలియా 3-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. బోలాండ్ ఈ సిరీస్‌లో 21 వికెట్లు పడగొట్టి, హైయ్యెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా చివరి టెస్టులో 10 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’‌గా నిలిచాడు. బోలాండ్ రాణించకపోతే సిరీస్ భారతే గెలిచేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అతడి వల్లే ఇండియా BGT ఓడిపోయిందని షాకింగ్ కామెంట్లు చేశాడు.

బోలాండ్ జట్టులోకి రావడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో బోలాండ్‌కు అవకాశం దక్కింది. దీనిని అశ్విన్ "ఆస్ట్రేలియాకు అదృష్టం"గా అభివర్ణించాడు. "పాట్ కమిన్స్ బాగానే బౌలింగ్ చేశాడు, కానీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌పై కాస్త ఇబ్బంది పడ్డాడు. బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. ఒకవేళ బోలాండ్ ఆడకపోయి ఉంటే, భారత్ సిరీస్ గెలిచేది," అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ 'యాష్ కీ బాత్'లో చెప్పాడు.

హేజిల్‌వుడ్ స్కిల్ ని అశ్విన్ కొనియాడాడు. "జోష్ హేజిల్‌వుడ్‌ను తక్కువ చేయట్లేదు. అతను అద్భుతమైన బౌలర్. కానీ, ఆస్ట్రేలియా తమ అసలు జట్టుతోనే ఉంటే భారత్ గెలిచేది. బోలాండ్ రౌండ్-ది-వికెట్ బౌలింగ్‌తో మా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు" అని అశ్విన్ పేర్కొన్నాడు.

టీమిండియాలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు. బోలాండ్ సిరీస్‌లో జైస్వాల్, పంత్‌లను పలుమార్లు ఔట్ చేశాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 35 ఏళ్ల బోలాండ్ తన కెరీర్ లాస్ట్ దశలో ఉన్నాడు. కానీ, ఆస్ట్రేలియా పేస్ దళంలో కీలక ఆటగాడిగా ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం 13 టెస్టుల్లోనే 17.66 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. రానున్న రోజుల్లో బోలాండ్ ఆస్ట్రేలియా జట్టులో మరింత కీలకం కానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: