ప్రముఖ భారతీయ క్రికెట్ ప్లేయర్లలో ఒకరైన రింకు సింగ్  కూడా ఒకరు. 2023లో ఆగస్టు నెలలో ఐర్లాండ్ పైన అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఐపీఎల్ లో అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడుతూ ఉన్నారు. రింకు సింగ్ కుటుంబం కూడా చాలా పేద కుటుంబమేనట. ఈయన తండ్రి ఎల్పిజి కంపెనీ పనిచేసేవారట. అయితే తాజాగా రింకు సింగ్ ఎంగేజ్మెంట్ అయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి అది కూడా భారతీయ రాజకీయ నాయకురాలు అయిన ప్రియా సరోజ్ తో ఎంగేజ్మెంట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రియా సరోజ్ సమాజ్వాది పార్టీకి చెందిన లోక్సభ ఎన్నికలలో అతి చిన్న వయసులోనే ఎంపీగా గెలిచిందట. ప్రియా సరోజి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా ఉండేదట. ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే తూపాని సరోజ్ కుమార్తె ఈ ప్రియా సరోజ్. ఈమె లోక్సభ నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచిందట.. ప్రియా సరోజ్  విద్యాభ్యాసాన్ని మొత్తం ఢిల్లీ ఎయిర్పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో పూర్తి చేసినదట. 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మచ్లిషహర్  లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిందట.. రింకు సింగ్తో ఈ యువ ఎంపీకి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి వేడుకకు సంబంధించి త్వరలోనే ఫోటోలు కూడా రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం మాత్రం అటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


రింకు సింగ్ ఐపీఎల్ 2025లో కోల్కత్తా నైట్ రైడర్స్ పక్కన కొనసాగించబోతున్నారు.. 13 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది . మరి వ్యక్తిగత జీవితంలో కూడా సరికొత్త ఇన్నింగ్స్ వైపు అడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయం పైన అటు రింకూ సింగ్ ఫ్యామిలీ కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ఇప్పటివరకు 30 t20 మ్యాచ్లలో ఆడారట.

మరింత సమాచారం తెలుసుకోండి: