ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే.. వైస్-కెప్టెన్ పదవి కోసం గంభీర్ హార్దిక్ పాండ్యా పేరును సూచించగా, రోహిత్, అగార్కర్ మాత్రం శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని పట్టుబట్టారట. ఇక రెండో అంశం వికెట్ కీపర్ సెలక్షన్. ఇక్కడ గంభీర్ సంజూ శాంసన్‌కు మద్దతు ఇవ్వగా, రోహిత్, అగార్కర్ మాత్రం రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపారట. చివరికి వీరిద్దరి వాదన నెగ్గడంతో పంత్‌కు జట్టులో చోటు దక్కింది.
ఇదిలా ఉండగా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు వన్డేలకు దూరం కావచ్చని ఆయన తెలిపారు. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు అగార్కర్ పేర్కొన్నారు. బుమ్రా ఫిట్‌నెస్‌పై పూర్తి అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన అగార్కర్, "బుమ్రాకు ఐదు వారాల పాటు బౌలింగ్‌కు దూరంగా ఉండమని వైద్యులు సూచించారు. అతను తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడు. ఫిబ్రవరి మొదటి నాటికి బుమ్రా ఫిట్‌నెస్‌పై వైద్య బృందం నుంచి నివేదిక వస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నారు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్ను నొప్పికి గురైన విషయం తెలిసిందే. సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్ చేయలేదు. సిరీస్ అనంతరం అతనికి స్కానింగ్ కూడా చేశారు. త్వరలోనే బుమ్రా ఆరోగ్యంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేస్తుందని అగార్కర్ తెలిపారు.
టీమిండియా ఫిబ్రవరి 11 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ఖరారు చేయాల్సి ఉంది. ఈ టోర్నీకి ముందు, భారత్ ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. బుమ్రా త్వరగా కోలుకుని టోర్నమెంట్‌కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు అగార్కర్ అభిమానులకు భరోసా ఇచ్చారు.