- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్రప్రదేశ్‌కు ఐపీఎల్ టీం ఎందుకు లేదన్నదానిపై ఆంధ్రా క్రికెట్ ప్రేమికుల‌కు చాలా ప్ర‌శ్న‌లు .. బాధ‌ల‌తో పాటు చాలా ఆవేద‌నే ఉంది. అయితే ఇప్పుడు ఏపీ కి ఓ ఐపీఎల్ టీం అంటూ లేక‌పోయినా .. క‌నీసం ఏపీలో ఐపీఎల్ మ్యాచ్ లు అయినా నిర్వ‌హించేలా చూడాల‌న్న డిమాండ్లు ఉన్నాయి. ఏపీలో ఇప్పుడు ఉన్న ఒకే ఒక స్టేడియం విశాఖ. అక్క‌డ మాత్రం అప్పుడ‌ప్పుడు మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి. విశాఖ తో పాటు మంగ‌ళ‌గిరిలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు జ‌రిగేలా చూడాల‌ని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం భావిస్తోంది.


ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతం విస్త‌రించి ఉన్న మంగళగిరిలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఓ స్టేడియాన్ని కట్టడం ప్రారంభించి ఏళ్లు గడిచిపోతోంది ..కానీ. పనులు మాత్రం న‌త్త న‌డ‌క‌గా ఉన్నాయి. అస‌లు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. అయితే ఏపీ లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారం లోకి రావ‌డంతో పాటు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే గా రికార్డు స్థాయి మెజార్టీ తో నారా లోకేష్ విజ‌యం సాధించ‌డం .. అటు ఆయ‌న మంత్రి కూడా ఉండ‌డంతో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి.


నిర్వహణ లేక పాడైపోయిన గ్రౌండ్ ను బాగు చేస్తున్నారు. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుగుణంగా ఉండేలా స్టేడియాన్ని ఒక రేంజ్ లో తీర్చిదిద్దుతున్నారు. ఐపీఎల్ సీజన్ వేసవిలో ప్రారంభం అవుతుంది .. ఈ క్ర‌మంలోనే ఈ సారి ఏపీ క్రికెట్ సంఘం నుంచి వివ‌రాలు తీసుకుని ఇక్క‌డ కొన్ని మ్యాచ్ లు అయినా కూడా నిర్వ‌హిస్తార‌న్న ఆశ లు అయితే ఏపీ క్రికెట్ .. క్రీడా భిమానుల్లో ఉన్నాయి. బీసీసీఐకి ఏసీఏ .. మంగళగిరి స్టేడియాన్ని అప్పటికల్లా రెడీ చేస్తామన్న భరోసా ఇస్తే.. ఖచ్చితంగా మ్యాచ్‌లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్క‌డ మ్యాచ్ లు జరిగితే అది మ‌న రాజ‌ధానికి మంచి ప్ర‌చారం తీసుకు వ‌చ్చిన‌ట్టు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: