క్రికెట్ ఆటగాళ్లకు బీసీసీఐ మరో షాకిచ్చింది. ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌ త్వరలో ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ప్లేయర్లు సొంత కార్లలో ఈ మ్యాచ్ కి వెళ్లొద్దు అని బీసీసీఐ ఒక రూల్ పెట్టింది అంతేకాదు స్పెషల్ ఏర్పాట్లు ఎవరూ చేసుకోవద్దని జారీ చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే టీమ్ ప్లేయర్లందరూ బస్సులోనే కలిసి వెళ్లాలంటోంది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB).

వివరాల్లోకి వెళ్తే, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయాక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్లేయర్ల కోసం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటంటే, టూర్లకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గించాలి, సిరీస్‌ల మధ్యలో పర్సనల్ ఫొటో షూట్స్‌ పెట్టుకోకూడదు. ఇలాంటి కఠినమైన రూల్స్‌తో ఒక 10 పాయింట్ల లిస్టును రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు పంపింది BCCI.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు ముందు CAB ప్రెసిడెంట్ స్నేహసిష్ గంగూలీ ఈ రూల్స్‌ను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. "BCCI చెప్పిన 10 రూల్స్‌కు తగ్గట్టే మేం ఆటగాళ్ల కోసం స్పెషల్ వెహికల్స్ ఏర్పాటు చేయట్లేదు. టీమ్ బస్సు మాత్రమే ఉంటుంది. ప్లేయర్స్ అందరూ మ్యాచ్‌లకి, ప్రాక్టీస్‌కి టీమ్‌తో పాటే బస్సులో వెళ్లాలి, రావాలి" అని కుండబద్దలు కొట్టారు గంగూలీ.

BCCI ఈ కొత్త రూల్స్ పెట్టడానికి ముఖ్య కారణం టీమ్ అంతా కలిసి ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలనే. ప్రాక్టీస్ సెషన్స్‌కు, మ్యాచ్‌లకు అందరూ టీమ్‌తోనే వెళ్లడం తప్పనిసరి చేసింది. దీనివల్ల ఆటగాళ్ల మధ్య బంధం పెరుగుతుందని, ప్రొఫెషనల్ వాతావరణం ఏర్పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. అంతేకాదు, క్రికెట్‌ను అన్ని స్థాయిల్లో అభివృద్ధి చేయాలనేది కూడా వాళ్ల ఆలోచన.

ఇక జాతీయ జట్టుతో ఆడని సమయంలో ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో తప్పకుండా ఆడాలి. ఈ రూల్ ఇప్పటికే అమలులోకి వచ్చింది. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్స్ త్వరలో జరిగే రంజీ ట్రోఫీలో ఆడటానికి రెడీ అంటున్నారు. కానీ, గాయాల కారణంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రం ఈసారి ఆడట్లేదు.

ఈ కొత్త రూల్స్‌పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా స్పందించారు. ఈ రూల్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడానికి కాదని, టీమ్‌లో క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం పెంచడానికేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. చూస్తుంటే, bcci తీసుకున్న ఈ నిర్ణయాలు మన క్రికెట్ జట్టును మరింత బలంగా తయారు చేస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: