ఈ వీడియోను సంజూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడే అవకాశం గురించి సరదాగా కామెంట్ చేశాడు. "ఏదీ అసాధ్యం కాదు" అని ఇంగ్లీష్‌లో రాసుకొచ్చాడు. అంతేకాదు, "పాడాను అంతే" అంటూ మలయాళం, ఇంగ్లీష్ మిక్స్ చేసి (మంగ్లీష్‌లో) ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇక హిందీలో "నేను ముంబై రావాలా?" అని అడగడంతో ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపించారు.
దీనిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. "అవును నువ్వు ముంబైకి వస్తున్నావ్.. కానీ చెన్నై, రాజ్‌కోట్, పుణేలో ఆడిషన్స్ అయ్యాకే" అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఈ సరదా సంభాషణ చూస్తుంటే టీమ్ సభ్యుల మధ్య ఎంతటి స్నేహబంధం ఉందో అర్థమవుతోంది.
ఇక అసలు విషయానికి వస్తే, ఇంగ్లాండ్‌తో బుధవారం నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. కానీ వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీ జట్లలో మాత్రం అతనికి చోటు దక్కలేదు. రాబోయే మ్యాచుల్లో సంజూ తన టాలెంట్ చూపే అవకాశం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి సంజూను తప్పించడంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వన్డే ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉన్నప్పటికీ.. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లకు వికెట్ కీపర్లుగా అవకాశం ఇచ్చారు. అయితే సంజూ విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టుకు ఆడకపోవడమే అతడి ఎంపికకు అడ్డంకిగా మారిందని సమాచారం.
దీనిపై సంజూ తండ్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ అధికారులు తన కుమారుడి పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసోసియేషన్‌లోని కొందరు సభ్యులకు సంజూతో వ్యక్తిగత విభేదాలు ఉండటం వల్లే అతడికి జట్టులో చోటు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా వన్డే ఫార్మాట్‌లో సంజూ టాలెంట్‌ను ఎవరూ కాదనలేరు. ఈ విషయంలో ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు.