షమీ జట్టుకు ఎంత ముఖ్యమో సూర్యకుమార్ చెబుతూ.. "అతనిలాంటి ఎక్స్‌పీరియన్స్డ్ బౌలర్ జట్టులో ఉండటం చాలా గొప్ప విషయం. అతను ఏడాది తర్వాత తిరిగి వస్తున్నాడు. అతను మైదానంలో ఆడటాన్ని చూసేందుకు నేను చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా. అతడి రికవరీ, బౌలింగ్‌పై అతను పెట్టిన దృష్టి స్ఫూర్తిదాయకం." అని అన్నాడు.
అలా, వెటరన్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తిరిగి రావడంపై చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. షమీ దాదాపు ఏడాదిగా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. యాంకిల్ సర్జరీ తర్వాత కోలుకున్న షమీ ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో భారత బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించడానికి రెడీ అయిపోయాడు.
షమీ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. గాయం నుంచి కోలుకున్నాక, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలలో బెంగాల్ తరఫున ఆడి తన టెరిపిక్ ఫిట్‌నెస్‌ను చాటాడు.
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ తిరిగి అరంగేట్రం చేసి 156 రన్స్‌కు ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వైట్-బాల్ క్రికెట్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు, విజయ్ హజారే ట్రోఫీలో 5 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో.. అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి షమీ బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తాడు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఏడింటికి ప్రారంభమవుతుంది. తర్వాతి రెండు మ్యాచ్‌లు జనవరి 25, 28 తేదీల్లో చెన్నై, రాజ్‌కోట్‌లో జరుగుతాయి. చివరి రెండు మ్యాచ్‌లు జనవరి 31న పూణేలో, ఫిబ్రవరి 2న ముంబైలో జరగనున్నాయి. బలమైన ఇంగ్లండ్ జట్టుతో తలపడనున్న భారత్‌కు షమీ రాకతో బౌలింగ్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.