కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి t20 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎందుకంటే, వాళ్లు ఎంతో ఆశలు పెట్టుకున్న ముగ్గురు ఇంగ్లీష్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్.. ఈ ముగ్గురూ RCB జట్టులో 2025 IPL సీజన్ కోసం ఎంపికైన ప్లేయర్లు. భారీ ధర వెచ్చించి కొనుక్కున్న వీళ్లు ఇలా మొదటి మ్యాచ్‌లోనే చేతులెత్తేయడంతో RCB ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్‌ను RCB ఏకంగా రూ.11.50 కోట్లు పెట్టి కొనుక్కుంది. కానీ, ఫిలిప్ కేవలం మూడు బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మొదటి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. ఇక, రూ.8.75 కోట్లు పెట్టి కొన్న లియామ్ లివింగ్‌స్టోన్ కూడా డకౌట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బోల్తా పడ్డాడు. జాకబ్ బెథెల్‌ను రూ 2.6 కోట్లకు కొంటే.. అతను 14 బంతుల్లో కేవలం 7 రన్స్ మాత్రమే చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇలా ముగ్గురు ఆటగాళ్లు విఫలమవడంతో RCB ఫ్యాన్స్ ఫుల్లు డిసప్పాయింట్ అయ్యారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, భారత్ మాత్రం స్పిన్నర్లతో ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్.. ఈ ముగ్గురు స్పిన్నర్లు కలిసి ఏకంగా 5 వికెట్లు పడగొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే రాణించాడు. 44 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అందులో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

మొత్తానికి, RCB కొన్న స్టార్ ప్లేయర్లు తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమవడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లోనైనా వీరు రాణిస్తారో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: