దాదాపు 20 సంవత్సరాల తర్వాత... ఆమెతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2004 సంవత్సరంలో... ఆర్తి అహ్లావత్ అలాగే టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాహం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.
రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ తన కుటుంబంతో చాలా ఎంజాయ్ చేశాడు. అయితే గత కొన్ని నెలలుగా వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆయన భార్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన భార్యకు... విడాకులు ఇచ్చేందుకు వీరేంద్ర సెహ్వాగ్ నిర్ణయం తీసుకున్నాడట. అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు వీరేంద్ర సెహ్వాగ్.
మున్నా దీపావళి పండుగ సందర్భంగా... తన భార్య కాకుండా కొడుకు అలాగే తన తల్లి ఫోటోల ను మాత్రమే వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేశారు. అలాగే ఇటీవల ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లిన వీరేంద్ర సెహ్వాగ్ సింగిల్ ఫోటో మాత్రమే షేర్ చేసి విడాకుల వార్త కు బలం చేకూర్చాడు. ఇక ఈ ఫోటోలను చూసిన క్రికెట్ అభిమానులు అలాగే సోషల్ మీడియా వారియర్స్....నిజంగానే వీరేంద్ర సెహ్వాగ్.. విడాకులు తీసుకోబోతున్నాడా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆయన భార్య కానీ ఎక్కడ స్పందించలేదు.