క్రికెట్ ప్రపంచంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ఒక జంట విడాకుల న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆయన భార్య ఆర్తి విడాకులు తీసుకోబోతున్నారనేది ఆ న్యూస్ సారాంశం. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, త్వరలోనే వీరు తమ 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికే అవకాశముందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

సెహ్వాగ్‌ను, ఆర్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే ఫ్యాన్స్ కొద్దిరోజులుగా ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే, వీళ్లిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారట. అంతేకాదు, సెహ్వాగ్ తన సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో ఆర్తి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అనుమానం మరింత బలపడింది. 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కొడుకులున్నారు. ఇంత అన్యోన్యంగా ఉండే జంట మధ్య ఏం జరిగిందో అని అభిమానులు కంగారు పడిపోతున్నారు. అయితే, దీనిపై సెహ్వాగ్ కానీ, ఆర్తి గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ, ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని గట్టిగా నమ్ముతున్నారు.


సెహ్వాగ్ గురించి చెప్పక్కర్లేదు. టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా అతనో లెజెండ్. 104 టెస్టుల్లో 8,586 పరుగులు చేశాడు. 49.34 సగటుతో 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు బాదేశాడు. ఇండియా గ్రేటెస్ట్ క్రికెటర్లలో సెహ్వాగ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. అలాంటి సెహ్వాగ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పుడిలాంటి వార్తలు రావడం అభిమానులను కలవరపెడుతోంది.

ఇది ఒక్క సెహ్వాగ్ విషయంలోనే కాదు, ఇంకో క్రికెటర్ విషయంలోనూ ఇలాంటి సీనే రిపీట్ అయింది. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దాంతో వీరు కూడా విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి.

ఇంకా లిస్ట్ లోకి వస్తే, క్రికెటర్ మనీష్ పాండే, హీరోయిన్ ఆశ్రితా శెట్టి జంట కూడా సేమ్ టు సేమ్. 2019లో పెళ్లి చేసుకున్న ఈ జంట కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాదు, పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేసేశారు. వీళ్లిద్దరూ కలిసి కనిపించి కూడా చాలా రోజులైంది. దీంతో వీరు కూడా విడిపోతున్నారనే టాక్ నడుస్తోంది.

చూస్తుంటే, క్రికెటర్ల పెళ్లిళ్లలో ఏదో తేడా జరుగుతోందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. గత ఆరు నెలల్లోనే ఇలా ముగ్గురు క్రికెటర్ల పెళ్లిళ్లపై రూమర్స్ రావడం చూస్తుంటే, నిజంగానే ఏదో జరుగుతోందా అని సందేహం కలుగుతోంది. అయితే, ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే, వాళ్లెవరైనా స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: