ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో తిలక్ వర్మ ఒక రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండానే 300 పైచిలుకు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పూర్తి స్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా తిలక్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్‌మన్ పేరిట ఉండేది. చాప్‌మన్ 271 పరుగులు చేస్తే, తిలక్ ఏకంగా 318 పరుగులతో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లాడు.
తిలక్ వర్మ బ్యాటింగ్ స్టామినా ఏంటో చూస్తే షాక్ అవుతారు. తన లాస్ట్ నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో దక్షిణాఫ్రికాపై 107 (56 బంతుల్లో), దక్షిణాఫ్రికాపై 120 (47 బంతుల్లో), ఇంగ్లాండ్‌పై 19 పరుగులు, ఇంగ్లాండ్‌పై 72 పరుగులు.. ఇలా వరుసగా నాటౌట్‌గా నిలుస్తూ ఏకంగా 318 పరుగులు పిండుకున్నాడు.
మ్యాచ్ చివరికి వచ్చేసరికి ఉత్కంఠ రేపింది. చివరి 18 బంతుల్లో భారత్ విజయానికి 20 పరుగులు కావాలి. ఈ సమయంలో తిలక్ కాస్త తడబడ్డాడు. స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ వెంటనే తేరుకుని రవి బిష్ణోయ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక అంతే, బిష్ణోయ్ మొదటి రెండు బంతుల్లోనే బౌండరీ బాదేశాడు. దాంతో ఒక్కసారిగా టీమ్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది.
ఆ తర్వాత ఓవర్లో బిష్ణోయ్ మరో ఫోర్ కొట్టడంతో టెన్షన్ తగ్గిపోయింది. చివరి ఓవర్‌లో గెలవడానికి 6 పరుగులు కావాలి. తిలక్ వర్మ మాత్రం ఏ మాత్రం కంగారు పడకుండా కూల్‌గా ఆడాడు. చివరికి స్టైలిష్ బౌండరీతో మ్యాచ్ ఫినిష్ చేశాడు. భారత్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం విశేషం.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మను ఆకాశానికెత్తేశాడు. ప్రెజర్లో కూడా బాధ్యత తీసుకుని అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. బిష్ణోయ్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. "బిష్ణోయ్ నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు. బ్యాట్‌తో కూడా టీమ్‌కు కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాడు" అని సూర్యకుమార్ అన్నాడు. మొత్తానికి తిలక్, బిష్ణోయ్ ఇద్దరూ కలిసి టీమ్‌ను గెలిపించి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు.