టీమ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు ఈ మధ్యకాలంలో ప్రేమలో పడుతూ ఉన్నప్పటికీ మరి కొంత మంది విడాకులు బాటపడుతూ ఉన్నారు. ఇటీవలే ప్రముఖ మాజీ క్రికెటర్ సేవాగ్  తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నారనే విషయాలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు తాజాగా మహమ్మద్ సిరాజ్ ప్రేమలో పడినట్లుగా కొన్ని వార్తలు వైరల్ గా మారడమే కాకుండా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ సింగర్లలో ఒకరైన జనై బోస్లే తన బర్త్డే వేడుకలలో మహమ్మద్ సిరాజ్ తో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


దీంతో పలువురు నేటిజెన్సు అభిమానులు కూడా జనై భోస్లే టీం ఇండియన్ క్రికెటర్ తో ప్రేమలో పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. జనై బోస్లే ఎవరో కాదు ప్రముఖ గాయనిగా పేరుపొందిన ఆశాభోస్లే మనవరాలే.. ముంబైలో తన 23వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో ఈమె ఫోటోలను షేర్ చేస్తూ సిరాజుతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి డేటింగ్ పుకార్లకు స్థానం కల్పించింది. మరి వీరి మధ్య స్నేహం ఉందా లేకపోతే మరేమైనా ఉందా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


మొత్తానికి తన పుట్టినరోజు వేడుకలలో సిరాజుతో కలిసి దిగిన ఫోటోలలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారట. అయితే ఈ ఫోటోలకు సంబంధించి అటు జనై, సిరాజ్  మాత్రం ఇంకా స్పందించలేదు.. మొత్తానికి సింగర్ జనైకి మాత్రం పుట్టినరోజున  అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే ఐపీఎల్ లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్ తరఫునుంచి ఆడుతున్నారు. మరి ఏంటన్న విషయం పై అభిమానులకు క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. మొత్తానికి అయితే ఈ విషయం అయితే ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: