సింగర్ జనై బోస్లె పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకను ముంబైలో చాలా గ్రాండ్ గా జరుపుకోవాలని అక్కడికి మహమ్మద్ సిరాజు వెళ్లడంతో ఒకసారిగా వీరిద్దరి పెళ్లి వార్తలు వైరల్ గా మారాయి..జనై బొస్లె తో తన రిలేషన్షిప్ పైన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది క్రికెటర్ సిరాజ్.. తనకు జనై చెల్లెలు లాంటిదని దయచేసి ఎవరూ కూడా తప్పుడు ప్రచారం చేయకండి అంటూ తెలియజేశారు. ఈ క్రమంలోనే సిరాజ్ ఒక ఫోటోను కూడా తెలియజేయడం జరిగింది.
జనై లాంటి చెల్లెలు తనకు ఎవరూ లేరని.. ఆమె లేకుండా తన జీవితం ఉండదని ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ చంద్రుడు ఒక్కటే ఉంటారు వెయ్యి మందిలో ఆమె కూడా ఒకరు అంటూ తెలియజేశారు. ఈ పోస్టుకు సైతం సింగర్ జనై కూడా ఇలా రియాక్ట్ అవుతూ తనకు చాలా ఇష్టమైన సోదరుడు సిరాజ్ అంటూ తెలియజేసింది. మొత్తానికి ఇలా వీరిద్దరి మధ్య రూమర్స్ కి ఒక్క పోస్టుతో పుల్ స్టాప్ పెట్టడంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ రూమర్స్ వినిపిస్తూ ఉండడంతో చివరికి సెలబ్రిటీల క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.