తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు గురించి జనాలకు చెప్పాల్సిన పనిలేదు. అంబటి రాయుడు ప్రొఫెషనల్ క్రికెటర్ అయినప్పటికీ రాజకీయాలలోకి వచ్చిన తరువాతనే అతని పేరు వైరల్ కావడం గమనార్హం. దానికి కారణం నిలకడలేని ఆయన మనస్తత్వమే అని ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోవాల్సిన పనిలేదు. క్రికెటర్ గా రాయుడికి అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ స్థిరత్వం లేకపోవడం, దూకుడు మనస్తత్వం, తొందరపాటు నిర్ణయాల కారణంగా క్రికెట్ కెరీర్ తొందరగానే ముగిసిపోయింది అని చెప్పుకోవచ్చు. అవును, రాయుడు తన క్రికెట్ కెరీర్ ను తానే దుందుడుకు పోకడలతో చేజేతులా నాశనం చేసుకున్నాడు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

ఇక ఆ తరువాత లాభం లేదనుకొని, రాజకీయాలలో ప్రవేశించాడు రాయుడు. ఇక అక్కడ కూడా అంతే. నిలకడ లేమి, స్థిరత్వం లేకపోవడంతో తొలి అడుగులోనే తడబడ్డాడు. క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన తరువాత అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో సదరు నియోజకవర్గంలో కొంత కాలం చురుగ్గా పర్యటించి, కొద్దిగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. గుంటూరు లోక్ సభ నియోకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న కోరికతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే చేరిన రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి పోటీకి అవకాశం లేదని గ్రహించిన రాయుడు క్షణం ఆలోచించకుండా వైసీపీ గుడ్ బై చెప్పి, వారం రోజుల వ్యవధిలోనే  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఇటువంటి నిలకడలేని తనంతో తొలి అడుగులోనే రాజకీయాలలో నిలకడలేని వ్యక్తిగా ముద్ర పడ్డారు. దీంతో గత ఎన్నికల ముందు అటు వైసీపీ కానీ, ఇటు జనసేన కానీ ఆయనను పెద్దగా పట్టించుకోలేదు.  

అది కాస్త పక్కనబెడితే ఇప్పుడు అంబటి రాయుడు కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అవును, నేడో రేపో రాయుడు బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అంబటి రాయుడు నుంచి ఎటువంటి ప్రకటనా లేకపోయినప్పటికీ విశాఖలో జరిగిన ఏబీవీపీ సభల్లో అంబటి రాయుడు పాల్గొనడం గమనార్హం. కాగా ఈ వైదికపై అంబటి రాయుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. అంతేకాకుండా దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ మాత్రమేనంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు. దీంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఏదిఏమైనా రాయుడుకి నిలకడ లేదని మరోసారి రుజువు అయ్యిందని జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: