ఈ నేపథ్యంలో ఈ యువ ఆటగాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు బాధ్యత ఆడాలని తోటి ఆగతాళ్లకు సూచించాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20 పరాజయం అనేది బాధించినా వీలైనంత త్వరగా ఈ ఫలితాన్ని మరిచిపోయి, చివరి 2 టీ20లపై ఫోకస్ పెట్టాలని సహచర ఆటగాళ్లకు సూచించాడు. ఇక రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఇంగ్లడ్ ఐదు టీ20ల సిరీస్‌లో 1-2తో నిలిచింది. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ.. 'ఈ మ్యాచ్‌లో మేం గెలవలేకపోయాం. కానీ గేమ్‌లో గెలుపు ఓటములు సహజమే. వీలైనంత త్వరగా ఈ ఫలితాన్ని మరిచి తదుపరి మ్యాచ్ కోసం సిద్ధపడతాము. దేశం కోసం ఆడుతున్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. నేను నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను. జట్టు కోసం ఎప్పుడైనా బౌలింగ్ చేసేందుకు నేను రెడీ. నా ఫ్లిప్పర్(బ్యాక్ స్పిన్)పై నేను ఫోకస్ పెట్టాను. అది అద్భుతంగా పనిచేస్తోంది. గత మ్యాచ్‌లో నేను చెప్పినట్లు నేను బౌలింగ్ చేసి ఉండవచ్చు. కానీ ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను!.' అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.