అవును, ఆర్తి అహ్లావత్‌తో తన 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి. 2004లో ఈ ఇద్దరికి పెళ్లికి కాగా.. ఇద్దరు కుమారులున్నాయి. ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్‌లు కూడా క్రికెట్‌లో రాణిస్తున్నారు. ప్రస్తుతం సెహ్వాగ్ మరియు ఆర్తి మధ్య విడాకుల వార్తలు క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేశాయి. ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఎంటంటే, ఈ గ్రే డివోర్స్ అంటే ఏమిటి? దీన్ని ఆర్తి, సెహ్వాగ్ తీసుకోవచ్చా? అనే ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి.
గ్రే డివోర్స్ అంటే వృద్ధాప్యంలో విడాకులు తీసుకోవడం అని అర్ధం. గతంలో భారత దేశంలో గ్రే డివోర్స్‌కు ఎటువంటి స్థానము లేదు. గ్రే విడాకులలో ముఖ్యమైన అంశం ఏమిటంటే? స్త్రీలలో పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్ర్యం. ఎక్కువ మంది మహిళలు ఇపుడు వర్క్‌ఫోర్స్‌లోకి అడుగు పెట్టడం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించడం, ఆర్థిక భద్రత కోసం తమ జీవిత భాగస్వాములపై ఆధారపడక పోవడం వంటి నిర్ణయాలు ఇపుడు ఇటువంటి విడాకులకు ప్రధాన కారణం అయి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రే డివోర్స్ అనేది 30, 40 ఏళ్ల వయసులో విడాకుల తీసుకునే దానికంటే భిన్నంగా ఉంటుంది. ఈ కాలంలో పురుషుడు, స్త్రీ ఇద్దరూ ఆదాయం పొందుతున్నారు కాబట్టి ఇటువంటి వింత పోకడలు మొదలయ్యాయని నిపుణులు అంటున్నారు.