విషయం ఏమిటంటే? ఇంగ్లాండ్ - సౌతాఫ్రికా అండర్ - 19 జట్లు అనధికార టెస్టు మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 30.4 ఓవర్ వద్ద ఇంగ్లాండ్ బ్యాటర్ అయినటువంటి ఆర్యన్ సావంత్ క్రీజ్‌లో ఉండగా సౌతాఫ్రికా బౌలర్ జాన్ రోల్స్ వేసిన బంతిని స్వీప్ షాట్ చాలా చక్కగా ఆడాడు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. షార్ట్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ జోరిచ్ వాన్ హెల్మెట్‌ను తాకిన బంతి, మరలా స్టంప్స్ వైపునకు రిటర్న్ వచ్చి, బెయిల్స్ను పడగొట్టింది. అప్పటికే షాట్ ఆడిన సావంత్ క్రీజ్ బయట ఉన్నాడు. బంతి బెయిల్స్‌ను పడగొట్టడం వల్ల సౌతాఫ్రికా జట్టు రనౌట్కు అప్పీల్ చేయడం జరిగింది.
ఇక బంతి తొలుత హెల్మెట్‌ను తాకిందని అంతా అనుకున్నప్పటికీ, రిప్లేలో మాత్రం ఫీల్డర్ మోకాలిని బలంగా తాకినట్లు కనబడడం జరిగింది. దీంతో సావంత్ను రనౌట్గా ప్రకటించక తప్పలేదు. మరోవైపు, బ్యాటర్ సావంత్ అయితే పాపం షాక్‌కు గురైనట్లు అలాగే కాసేపు క్రీజ్‌లో అలా ఉండిపోవడం జరిగింది. ఇక బంతి బలంగా తాకడం వల్ల వాన్ బాధతో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే జట్టు సహచరులు వచ్చి అతడికి ఫిజియో థెరఫీ చేశారు. కాగా ఈ రనౌట్ పై నెటిజన్లు అయితే చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. 'అది డెడ్ బాల్గా ప్రకటించాలి కదా!', 'క్రికెట్‌లో ఇటువంటి దురదృష్టమైన బ్యాటర్ మరలా పుట్టాడేమో!' అంటూ కామెంట్లు పెడుతున్నారు.