ఈ లీగ్‌లో 90-90 బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వంటి ఎందరో మహామనులు ఆడనున్నారు. లెజెండ్స్ 90 లీగ్ డైరెక్టర్ శివన్ శర్మ తాజాగా మాట్లాడుతూ, ‘క్రికెట్‌లోని కొంతమంది గొప్ప ఆటగాళ్లతో ఈ ప్రత్యేకమైన 90-బంతుల ఫార్మాట్‌ను హోస్ట్ చేయడానికి మేం చాలా ఆతృతగా ఉన్నాం. ప్రపంచ స్థాయి, అద్భుతమైన దేశీయ ఆటగాళ్లతో కూడిన ఈ లీగ్ అభిమానులకు వినోదాన్ని అందించగలదని పూర్తి విశ్వాసంతో ఉన్నాం అని తెలిపారు.
మొత్తం ఫ్రాంచైజీ జట్ల జాబితా:
ఛత్తీస్‌గఢ్ వారియర్స్, దుబాయ్ జాయింట్స్, హర్యానా గ్లాడియేటర్స్, గుజరాత్ సాంప్ ఆర్మీ, బిగ్ బాయ్స్, ఢిల్లీ రాయల్స్, రాజస్థాన్ కింగ్స్ జట్లు పాల్గొంటాయి. ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌లో మార్టిన్ గప్టిల్, సురేశ్ రైనా, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లు పాల్గొనగా, ఢిల్లీ రాయల్స్‌లో రాస్ టేలర్, శిఖర్ ధావన్ వంటి స్టార్ ఆటగాళ్లు మెరవనున్నారు. హర్యానా గ్లాడియేటర్స్ కూడా హర్భజన్ సింగ్‌ను తమ జట్టులో భాగంగా చేసుకున్నారు. మరోవైపు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రాజస్థాన్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ లీగ్‌లో భాగం కావడం విశేషం.