గత కొద్దిరోజులుగా టీమ్ ఇండియన్స్ క్రికెట్ గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఇటీవలే విడాకులు, ప్రేమ వ్యవహారాలు వంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. టీమిండియా క్రికెట్ ప్లేయర్ ఆల్రౌండర్ మహమ్మద్ సిరాజ్ ఒక నటితో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది క్రికెటర్స్ హీరోయిన్స్ నీ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మహమ్మద్ సిరాజ్ ఒక స్టార్ నటితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక ఆమె ఎవరో కాదు హిందీ బిగ్ బాస్-13 సీజన్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మహిరా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని సైతం అటు సిరాజ్ మహిరా స్నేహితుల సైతం ధ్రువీకరించినట్టుగా బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం ఎక్కడా కలిసి కనిపించినట్లుగా ఫోటోలు మాత్రం బయటపడలేదు. సోషల్ మీడియాలో కేవలం ఒకరినొకరు ఫాలో అవుతూ.. ఫోటోలకు లైక్స్, కామెంట్స్ వంటివి చేసుకుంటున్నారు తప్ప వీరిద్దరికి సంబంధించి ఎక్కడ కూడా ఫోటోలు బయటపడలేదు.

ఇలాంటి సమయంలోనే వీరి మధ్య నుంచి రూమర్స్ కూడా వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పర్యటించారు సిరాజ్.. మహిరా శర్మ కూడా పంజాబీ భాషలో నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె జమ్మూ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన బిగ్ బాస్ వల్ల భారీ క్రేజ్ సంపాదించుకుంది. సిరాజ్, మహిరా శర్మ డేటింగ్ వార్తలు రోజు రోజుకి ఎక్కువగా కావడంతో ఈమె తల్లి సైతం తల్లి ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బయట వినిపించే రూమర్స్ గురించి మీరు ఎలా మాట్లాడుతారు.. అంటూ ఫైర్ అవుతోంది.తన కూతురు ఒక సెలబ్రెటీ కావడం చేత ఇలాంటివి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వీటిని నమ్మవద్దండి అంటూ తెలిపింది. మరి అసలు విషయంపై క్రికెటర్ సిరాజ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి ఇటీవలే బాలీవుడ్ సింగర్ తో కూడా ఇలాంటి రూమర్స్ రావడంతో ఆమె అన్నయ్య అంటే క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: