న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, రైల్వేస్ మధ్య రంజీ మ్యాచ్ చాలా హాట్టహాసంగా ఆరంభం అయ్యింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లీ దేశవాళీ మ్యాచ్ ఆడడంతో అతనిని చూసేందుకు జైట్లీ స్టేడియానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. దీంతో స్టేడియం వద్ద తొక్కిసలాట కూడా జరిగినట్టు సమాచారం. స్టేడియంలోకి అభిమానులు ఎంట్రీ ఇచ్చే 16 గేటు వద్ద పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాటకు దారి తీసింది. దాంతో పలువురు అభిమానులు గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనలో ఓ పోలీస్ బైక్ కూడా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా గాయపడిన అభిమానులకు గేటు దగ్గర డీడీసీఏ సెక్యూరిటీ, పోలీసులు చికిత్స అందించడం జరిగింది. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక అసలు విషయంలోకి వెళితే, అరుణ్ జైట్లీ స్టేడియం క్యాంటిన్ హెడ్ ఒకరు విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేసాడు. భారత క్రికెటర్ ప్రపంచంలో కోహ్లీ సూపర్ స్టార్ హోదాని కలిగి ఉన్నప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు లేదని, చాలా నిరాడంబరంగా ఉన్నారని చెప్పారు. యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారంటూ కితాబిచ్చాడు. అందుకే జనాలు ఆయనంటే పడి చస్తారని, ఓ సినిమా స్టార్ కి ఉన్న ఫాలోయింగ్ ఆయనకే సొంతం అని అన్నారు. కోహ్లీ ఇప్పటికీ తమ పట్ల అదే గౌరవం, ప్రేమ చూపిస్తున్నారని పేర్కొన్నారు. కాగా రైల్వేస్‌తో జరుగుతున్న రంజీ మ్యాచులో ఢిల్లీ తరఫున కోహ్లీ బరిలోకి దిగిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ మ్యాచ్ చూసేందుకు జనాలు అలా తండోపతండాలుగా తరలి వస్తారని ఢిల్లీ క్రికెట్‌ నిర్వాహకులు కూడా అంచనా వేయకపోవడం గమనార్హం. కోహ్లీ ఆట చూసేందుకు ఇంటర్ నేషనల్ మ్యాచ్ కూడా లేనంతగా అభిమానులు రావడంతో స్టేడియం కిక్కిరిసింది అని నిర్వాహకులు చెబుతున్నారు. కోహ్లి తన చివరి రంజీ మ్యాచ్ 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఆడాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం రైల్వేస్  జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రైల్వేస్  జట్టు 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.  

ఢిల్లీ (ప్లేయింగ్ XI): అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, సనత్ సాంగ్వాన్, యశ్ ధుల్, ప్రణవ్ రాజువంశీ(w), ఆయుష్ బడోని(సి), సుమిత్ మాథుర్, నవదీప్ సైనీ, శివం శర్మ, మనీ గ్రేవాల్, సిద్ధాంత్ శర్మ

రైల్వేస్ (ప్లేయింగ్ XI): అంచిత్ యాదవ్, సూరజ్ అహుజా(సి), వివేక్ సింగ్, ఉపేంద్ర యాదవ్(w), భార్గవ్ మెరాయ్, మహ్మద్ సైఫ్, కర్ణ్ శర్మ, హిమాన్షు సాంగ్వాన్, రాహుల్ శర్మ, అయాన్ చౌదరి, కునాల్ యాదవ్

మరింత సమాచారం తెలుసుకోండి: