ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌లో పరాజయం పాలైన టీమిండియా ఇపుడు మరో ఆసక్తికర పోరుకు రెడీ అయిపోయింది. శుక్రవారం పుణె వేదికగా జరిగిన నాల్గవ టీ20లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటికే 2-1తో ఈ సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి, సిరీస్ చేజిక్కించుకోవాలని ప్లాన్ వేస్తోంది. కాగా తొలి రెండు టీ20ల్లో ఓటమిపాలైన ఇంగ్లండ్‌, మూడో టీ20లో మాత్రం అసాధారణ రీతిలో విజయాన్నందుకుంది. ఇదే స్పూర్తిని చివరి రెండు టీ20ల్లో కనబర్చి సిరీస్ కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్. ఈ క్రమంలోనే నాలుగో టీ20పై సర్వత్రా అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇక టీమిండియా మూడో టీ20లో పరాజయం పాలవ్వడంతో ప్రస్తుతం జట్టులో స్వల్ప మార్పులు చేపట్టింది. గత మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి, మహమ్మద్ షమీని ఆడించగా.. అతను పెద్దగా ఆడింది లేదు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన షమీ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిల పడ్డాడు. అయితే ఈసారి షమీపై వేటు వేయకున్నా అతనికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించే ఛాన్స్ మెండుగా కనబడుతోంది. అతని కోసం స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై అయితే ఈసారి వేటు వేయనున్నారు. వెన్ను నొప్పితో గత 2 మ్యాచ్‌లకు దూరమైన రింకూ సింగ్ ఇపుడు అందుబాటులోకి వచ్చాడు. దాంతో అతని స్థానంలో ఆడిన ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు. గత 3 మ్యాచ్‌ల్లో అతను ఒకే రీతిలో ఔటవ్వడం కారణంగా నలువైపులా విమర్శలకు దారి తీసింది. ఇక నాలుగో టీ20లోనైనా అతను ఈ బలహీనతను అధిగమించి బాగా ఆడుతాడని అంతా ఆశిస్తున్నారు. అభిషేక్ శర్మ అప్పుడప్పుడు రాణిస్తున్నా.. భారీ ఇన్నింగ్స్ అయితే ఆడాల్సి ఉంది. కెప్టెన్ సూర్య ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదనే అపవాదు ఉంది. ఇక హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పర్వాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుత టీమ్ ని ఒకసారి పరిశీలిస్తే... భారత్ తుది జట్టు ఇదేనని తెలుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా/ శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ.

మరింత సమాచారం తెలుసుకోండి: