భారత దిగ్గజ క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని అంటే చెప్పాల్సిన పనిలేదు..క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండేలా చేసిన ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త సీజన్ కోసం సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ధోని తనని తాను ఫిట్గా మార్చుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు క్రికెట్లో మరొక వైపు వ్యవసాయ పనులు ,మరొక పక్క యాడ్ షూటింగులు అంటూ బిజీగా ఉంటున్న ధోని ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు జోరందుకుంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం.



ధోని రాజకీయాలలోకి వస్తున్నాడంటూ కొన్ని వార్తలు రావడం పైన ఈ విషయంపై bcci ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించడం జరిగింది.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు సైతం ఇంటర్వ్యూలో ధోని పొలిటికల్ ఎంట్రీ ప్రవేశం గురించి తెలియజేయడం జరిగింది రాజీవ్ శుక్లా. రాజకీయాలలోకి రావడం అనేది ధోని యొక్క వ్యక్తిగత విషయమని ఆయన వెస్ట్ బెంగాల్ రాజకీయాలలోకి వస్తారని తాను ఊహిస్తున్నట్లు తెలియజేశారు.. ధోని క్రికెట్లోనే కాదు రాజకీయాలలోను సత్తా చాట గలరని తెలిపారు రాజీవ్ శుక్లా.


ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఈజీగానే గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఎందుకంటే ధోనికే ఉన్న పాపులారిటీ గురించి తెలుసు అంటూ తెలిపారు రాజీవ్ శుక్లా.అలాగే పొలిటికల్ ఎంట్రీ పైన కూడా ధోనితో మాట్లాడానని తెలియజేశారు ఒకసారి లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్నారని వార్తలు కూడా వచ్చాయని అదే విషయంలో అతనితో చెప్పగా అయితే అవి కేవలం రూమర్స్ అంటూ తెలిపారని తెలిపారు. ఇలా ధోని పొలిటికల్ ఎంట్రీ పైన ఎన్నో విభిన్నమైన అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఒకవేళ ధోని రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవతారంటూ పలువురు నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ధోని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: