అవును, మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు ఆన్లైన్లో స్టార్ట్ కాగానే క్షణాల్లో బుక్ అయిపోయాయి. తాజాగా దుబాయ్ వేదికగా జరిగే టీమిండియా మ్యాచ్ ల టికెట్ల విక్రయాలతో పాటు భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌ టికెట్లతో పాటు ఇతర మ్యాచ్ ల టికెట్లను ఆన్ లైన్ లో ఉంచడం జరిగింది. కాగా భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ముగియగా ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 3 మ్యాచ్‌ల ఈ సిరీస్ ఫిబ్రవరి 6న ప్రారంభమైతే , ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం లక్షలాది మంది దేశాఅభిమానులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ రెండు జట్ల మధ్య జరిగే హై-వోల్టేజ్ పోరుకు టిక్కెట్లు ఇప్పుడు అమ్మకానికి రాగా అన్ని టీమ్ ఇండియా మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయాలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ అభిమానులు ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే క్షణాల్లో అంటే క్షణాల్లో టీమిండియా మ్యాచెస్ టికెట్స్ అమ్ముడు పోయిన ఘట్టాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. టీమ్ఇండియా గ్రూప్ దశలో తన మూడు మ్యాచ్‌లను దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుండగా ఫిబ్రవరి 23న భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్‌తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.

ఇక టీంఇండియా సెమీఫైనల్స్ కు చేరుకుని, ఫైనల్ కు కూడా చేరుకుంటే, ఈ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే జరగనున్నాయని సమాచారం. దుబాయ్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లకు టికెట్ ధరలు 125 AED నుండి స్టార్ట్ అయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2900. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయచ్చు. లేదా నేరుగా దుబాయ్ స్టేడియంలోని ‘టికెట్ కలెక్షన్ సెంటర్’ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి లాహోర్‌లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి, భారతదేశం తప్ప మిగిలిన 6 జట్లు పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడతాయి. లాహోర్‌తో పాటు, కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత రెండు సెమీ-ఫైనల్స్ ఉంటాయి, ఆ తర్వాత మార్చి 9న ఫైనల్ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: