టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను ఇంగ్లాండ్‌ మాజీ ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ ఆకాశానికెత్తేశారు. నా జీవితంలో కొట్టినన్ని సిక్సులు…2 గంటల్లో అభిషేక్‌ శర్మ కొట్టి పారేసాడు అంటూ కితాబిచ్చాడు. ఇలాంటి ఆటగాడిని మునిపెన్నడూ నేను చూడలేదని అభిషేక్‌ శర్మను కుక్ తెగ పొగిడేశారు. దీంతో అలిస్టర్‌ కుక్‌ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ కాబోతుండడంతో అభిషేక్ అభిమానులు కిందామీదా అయిపోతున్నారు. కొందరు తమదైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఒక విదేశీ ఆటగాడు మన స్వదేశీ అతగాడిని ఇంతలా పొగడడం తొలిసారని, సొంత దేశపు ఆటగాళ్ళైనా ఇలా పొగిడిన దాఖలాలు దాదాపు శూన్యం అంటూ చేసిన కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి.

ఇకపోతే ఇంగ్లాండ్‌ వర్సెస్‌ టీమిండియా మధ్య తాజాగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్‌ వర్సెస్‌ టీమిండియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ లో సెంచరీ పూర్తి చేసుకున్న ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. మ్యాచ్‌ లో మొత్తం 135 పరుగులు చేసి ఔట్‌ కాగా, గిల్‌ రికార్డును సైతం బద్దలు కొట్టాడు అభిషేక్. 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 126 పరుగులు చేశాడు. టీ20ల్లో భారత్‌కు ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా ఇప్పుడు 135 పరుగులు చేసి తొలి బ్యాటర్‌ గా రికార్డు సృష్టించాడు ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ. దాంతో సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక 2013లో 'ఆరోన్ ఫించ్' ఇంగ్లాండ్‌ పై 156 పరుగులు చేశాడు. ఆ తర్వాత అభిషేక్ చేసిన 135 పరుగులే ఇంగ్లండ్‌పై రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఒక్క ఇన్నింగ్స్‌ లో అభిషేక్ కొట్టిన సిక్స్‌లు 13. ఇలా ఒకే ఇన్నింగ్స్‌ లో 13 సిక్సులు కొట్టడంతో ఇదే తొలిసారి కావడంతో ఇది అరుదైన ఘటనగా నమోదు అయ్యింది. 2017లో శ్రీలంకపై రోహిత్ 10 సిక్సులు కొట్టగా 2024లో దక్షిణాఫ్రికాపై సంజూ శాంసన్, తిలక్ వర్మ కొట్టారు. అభిషేక్ తన సెంచరీని పూర్తి చేయడానికి 37 బంతులు మాత్రమే వాడుకున్నాడు. 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. అంటే… టీమిండియా తరఫున రెండవ వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌ గా టీమిండియా భయంకరమైన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ రికార్డు సృష్టించినట్టే మరి! దాంతో టీమిండియా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: