2006లో సచిన్ టెండూల్కర్ తన 350వ ఇన్నింగ్స్‌లో 14,000 పరుగులు పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడు. అయితే కోహ్లీ ఇప్పటి వరకు 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 13,906 పరుగులు సాధించాడు. అంటే కేవలం 94 పరుగులు చేయగలిగితే ఈ ఘనతని ఆయన బ్రేక్ చేయనున్నాడు. కోహ్లీ తన కెరీర్‌లో 50 వన్డే సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా, ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా టెండూల్కర్ (49)ను అధిగమించి, 50 సెంచరీలతో రికార్డు నెలకొల్పిన సంగతి విదితమే.
ఇకపోతే భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో 3 వన్డేల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఈ సిరీస్ అనంతరం ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు జట్టులో పెద్దగా మార్పులు ఉండక పోవచ్చని తెలుస్తోంది. అయితే, మొదటి 2 వన్డేల కోసం జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన భారత్ vs ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 4-1తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (ఉప-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.