ఇక అసలు విషయంలోకి వెళితే, తాజాగా బుమ్రాపైన శుభ్ మన్ గిల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో, ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల సిరీస్ కోసం బుమ్రాను జట్టులోకి తీసుకున్నారు. ఇక సిడ్నీలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ యొక్క 5వ మరియు ఆఖరి టెస్టులో బుమ్రాకు వెన్ను గాయం కారణంగా ఆటకి దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. గాయం కారణంగా బుమ్రా రెస్ట్ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇక బుమ్రా గనక ఆరోజు ఉండి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు శుభ్ మన్ గిల్. బుమ్రా ఆరోజు ఆడినట్లైతే సిరీస్ 2-2తో సమానం అయి టీమిండియాపై విమర్శలు తప్పేవి అని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే జస్ప్రీత్ జస్బీర్‌సింగ్ బుమ్రా అన్ని ఫార్మాట్‌లలో ఆడే క్రీడాకారుడు. విశిష్టమైన బౌలింగ్ యాక్షన్ అతని సొంతం. అందుకే బుమ్రాను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు. అతను దేశీయ క్రికెట్‌లో గుజరాత్ తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపునా ఆడతాడు. శుభ్ మన్ గిల్ విషయానికొస్తే... 38 ఇన్నింగ్స్‌లలో దాదాపుగా 2000 పరుగులు సాధించాడు. వన్డేలో 23 సంవత్సరాల వయస్సులో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా గిల్ పేరిట రికార్డు వుంది. అతను 2017లో విదర్భపై అరంగేట్రం చేశాడు. 2017–18 రంజీ ట్రోఫీలో బెంగాల్‌పై పంజాబ్ తరపున ఫస్ట్ - క్లాస్ పై అరంగేట్రం చేశాడు.