ఐపీల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ అయినటువంటి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ కనబరుస్తున్నారు. విషయం ఏమిటంటే.. భారత యంగ్ ఓపెనర్ "అభిషేక్ శర్మ"కు గుడ్ టైమ్ నడుస్తోందని చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది. ఇది ఆయన తాజా మ్యాచెస్ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. అవును... అతడు పట్టిందల్లా బంగారం అవుతోంది. బరిలో అడుగు పెట్టాడంటే సెంచరీలమీద సెంచరీలు కొట్టి పారేస్తున్నాడు. దాంతో ప్రత్యర్థి జట్లు వణికిపోతున్నాయి. కట్ చేస్తే... అభిషేక్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్తున్నాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్ కూడా ర్యాంకింగ్స్‌లో పరుగులు పెడుతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించడం జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ "ట్రావిస్ హెడ్" ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం అందరికీ ఆశ్చర్య పరిచింది. 855 పాయింట్లతో అతడు తొలి స్థానంలో కొనసాగుతూ ఉండగా... టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ లిస్ట్‌లో 2వ స్థానాన్ని దక్కించుకోవడం కొసమెరుపు. 829 రేటింగ్ పాయింట్లతో హెడ్ తర్వాతి పొజిషన్‌ చేజిక్కించుకున్నాడు అభిషేక్. ఇంతకు మునుపు 40వ స్థానంలో ఉన్న అభిషేక్.. ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఇరగదీసి ఆడడంతో ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ - 2కి చేరుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు!

ఇక అతడి తర్వాతి స్థానం విషయానికొస్తే... హైదరాబాదీ తిలక్ వర్మ 803 పాయింట్లుతో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ విషయానికొస్తే... (738) 5వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇక ఈ లిస్టు ప్రకటించగానే.. నెటిజన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు ఓపెనర్లు తొలి 2 స్థానాల్లో ఉన్నారని.. ఐపీల్ టీమ్ సన్ రైజర్స్ అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ - 2025లో ఒక్కో టీమ్‌కు దబిడిదిబిడేనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండడం విశేషం. ఇక మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి!

మరింత సమాచారం తెలుసుకోండి: