సూపర్‌ మ్యాన్ లాగా క్యాచ్‌లకు ప్రసిద్ధి గాంచిన జోబర్గ్ సూపర్ కింగ్స్ (JSK) సారథి "ఫాఫ్ డు ప్లెసిస్" గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... అదేవిధంగా అతని ఫ్లైయింగ్ క్యాచ్‌ల గురించి కూడా చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే? ఫాఫ్ డు ప్లెసిస్ క్యాచ్‌లు పట్టడంలో మంచి సిద్ధహస్తుడు. కాగా ఈ స్టార్ క్రికెటర్ వయసు 40 సంవత్సరాలు కావడం గమనార్హం. ఈ వయస్సు కారణంగానే ఈ సంవత్సరం ఐపీఎల్ వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అతనిని రిటైన్ చేసుకోలేదనే విషయం విదితమే. అవును, ఇక ఐపీఎల్ మెగా వేలంలో కూడా ఈ సీనియర్ ప్లేయర్ ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకి రాకపోవడం గమనార్హం. దాంతో ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ చెల్లించి ఈ స్టార్ ప్లేయర్ ను సొంతం చేసుకుంది.

ఇక విషయం ఏమిటంటే? ఈ 40 ఏళ్ల క్రికెటర్ ఇపుడు ఒక యువకుడిలా ఫీల్డింగ్ చేయడంతో యువ ఆటగాళ్లు సైతం అవాక్కవుతున్నారు. అవును... ఆయన పక్షిలా గాల్లోకి ఎగిరి అద్భుతమైన ఫ్లయింగ్ క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. సెంచూరియన్‌లోని స్పోర్ట్‌పార్క్ గ్రౌండ్‌లో జరిగిన దక్షిణాఫ్రికా t20 లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాఫ్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఈ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఇంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టుకు డేవిడ్ బెడింగ్ హామ్ (27) మంచి ఆరంభంలో మ్యాచ్ స్టార్ట్ చేసాడు. కానీ ఇమ్రాన్ తాహిర్ వేసిన 5వ ఓవర్ మొదటి బంతికి బెడ్డింగ్‌హామ్ దానిని మిడ్-ఆఫ్ వైపు కొట్టాడు. కట్ చేస్తే, బంతి 30 యార్డ్ సర్కిట్ దాటబోతుండగా, ఫాఫ్ డు ప్లెసిస్ అమాంతం అందుకున్నాడు.

అయితే సాధారణంగా అతను క్యాచ్ పట్టుకుంటే అది న్యూస్ ఎందుకవుతుంది చెప్పండి? పక్షిలా గాల్లోకి ఎగిరి దూకుతూ అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడంతో ఆ అందమైన, అరుదైన దృశ్యాన్ని చూసి జనాలు అవాక్కవుతున్నారు. తద్వారా ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ మరోసారి నిరూపించాడీ సీనియర క్రికెటర్. దాంతో ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జోబర్గ్ సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక క్యాచ్‌ను చూసిన బౌలర్ తాహిర్ అయితే ఆనందంతో మైదానం అంతటా పరిగెత్తాడు. తమకు చాలా అవసరమైన వికెట్‌ పడగొట్టినందుకు సంబరాలు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: