విషయంలోకి వెళితే... ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ గా కొనసాగుతున్న ఆమె, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు తాజాగా బిడ్‌ను వేసి గెలుచుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, చెన్నైకి చెందిన మీడియా కాంగ్లోమరేట్ ఫ్రాంచైజీలో 100% వాటా కోసం వర్చువల్ వేలంలో £100 మిలియన్లకు పైగా చెల్లించినట్టు భోగట్టా. ఈ డీల్ సొంతం చేసుకునేందుకు ఉన్న మరో 2 పార్టీలు కూడా బాగానే ట్రై చేసినా సన్ గ్రూప్ చివరికి వాటిని అధిగమించి చేజిక్కిచ్చుకుంది.
దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL )లో 100 బాల్ టోర్నమెంట్‌లో ఫ్రాంచైజీ ఉన్న 3వ అతిపెద్ద ఫ్రాంచైజీగా ఆమె నిలిచారు. గతంలో ముంబై ఇండియన్స్ ఓనర్ అంబానీ కుటుంబం, ఓవల్ ఇన్విన్సిబుల్స్‌లో 49% వాటా కోసం £60 మిలియన్లకు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా, ఐటీ వ్యవస్థాపకుడు సంజయ్ గోవిల్ వెల్ష్ ఫైర్‌లో 49% వాటాను £40 మిలియన్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో 2 ఫ్రాంచైజీలు సదరన్ బ్రేవ్ అండ్ ట్రెంట్ రాకెట్స్ కూడా త్వరలోనే అమ్మకానికి వస్తాయని అంతా అనుకుంటున్నారు. అంతకు మునుపు ఆమె (సన్ గ్రూప్) 2012 సంవత్సరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కొనుగోలు చేసింది. ఈ జట్టు ఇప్పటివరకు ఒకసారి మాత్రమే ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.