
వీరిద్దరూ ఇప్పటి వరకు భారత్ తరఫున టీ20, టెస్టులు మాత్రమే ఆడడం జరిగింది. ఈ మ్యాచ్‌తో వన్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్ ద్వారా కోహ్లీ ఫామ్ అందుకుంటాడని అంతా అనుకొనే లోపే కోహ్లీ గాయం కారమంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. దాంతో ఆయన స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడడం జరిగింది. అయితే తరువాత కూడా రెండో వన్డేకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేడా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.
ఇకపోతే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి.. యశస్వి జైశ్వాల్ ఓపెనర్‌గా దిగుతున్నాడు. శుభ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. ఇక టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం కల్పించకపోవడం కొసమెరుపు. అర్షదీప్ సింగ్‌కు సైతం తుది జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.
ఇక తుది జట్లు విషయానికొస్తే...
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమీ
ఇంగ్లాండ్:
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కేర్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్