అవును, మీరు విన్నది నిజమే. మరి అదేంటి? ఫుట్బాల్ ఎవరన్నా బాల్ తో ఆడుతారు కానీ, AK47తో ఫుట్బాల్ ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది అక్షరాలా నిజమే. కానీ ఇది మనదగ్గర కాదు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ పూర్తి కధనం చదవాల్సిందే. జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ గత కొంత కాలంగా కొట్టుకు చస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయి అనుకుంటున్న తరుణంలో మరో ఆశ్చర్యకరమైన విషయం తెరమీదకి వచ్చింది.

అవును, తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకై 47 రైఫిల్స్‌, అమెరికన్‌ ఎం సిరీస్‌ కు చెందిన తుపాకులతో ఫుట్‌బాల్‌ ఆడగా, సోషల్ మీడియా అట్టుడుకుతోంది. ఆడారు.మణిపూర్‌ కు చెందిన ఓ ఇన్‌ ఫ్లూయెన్సర్‌ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు చేయడంతో ఈ విషయం కాస్తా వైరల్‌ గా మారింది. ఈ వైరల్‌ వీడియో పై మైతేయి వర్గానికి చెందిన పౌర సమాజ సంస్థ హెరిటేజ్‌ సొసైటీ స్పందించింది. ఈ వీడియోను ఎక్స్‌ లో పోస్టు చేస్తూ... ''మణిపూర్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ వైరల్‌ గా మారడం గమనించారా? క్రీడాకారులు బహిరంగంగా అధునాతన ఆయుధాలు ప్రదర్శించడం చాలా దారుణమైన విషయం. ఇది కుకీ మిలిటెంట్ల ఫుట్‌ బాల్‌ టోర్నమెంటా? దీనిపై వెంటనే అధికారులు విచారణ జరపాలి!'' అని ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ట్యాగ్‌ చేస్తూ పోస్టు చేసింది.

విషయంలోకి వెళితే... రాజధాని ఇంఫాల్‌ కు దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో కాంగ్‌పోక్పీ జిల్లాలోని గామ్నోఫైలో, ఈ విచిత్రమైన.. క్రూరమైన ఫుట్‌బాల్‌ టోర్నీ నిర్వహించినట్లు వీడియో చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. కాగా గత (జనవరి) నెల 20న ఈ మ్యాచ్‌ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఫుట్‌బాల్‌ టోర్నీ నేపథ్యంలో ముదురు ఆకుపచ్చ దుస్తులు ధరించిన పలువురు స్టేడియం వద్ద తుపాకులతో మోహరించిన దృశ్యాలు వీడియోలో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దాంతో అధికారులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: