![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/this-is-a-runout-bro-when-do-you-not-see-something-like-this0ec9b3a3-407d-4859-915e-f7c52088940d-415x250.jpg)
అయితే ఇదే మాదిరి ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత ఆటగాళ్లు కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకోవడం కొసమెరుపు. హార్దిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్ ఐదో బంతిని ఫిల్ సాల్ట్ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా గ్యాప్‌లో కట్ షాట్ ఆడడంతో బౌండరీ దిశగా వెళ్లిన బంతిని, శ్రేయస్ అయ్యర్ వేగంగా పరుగెత్తి స్లైడ్ చేస్తూ ఆపడం జరిగింది. తరువాత ఆ బంతిని వేగంగా త్రో చేసి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ వైపు విసిరాడు. అప్పటికే రెండో పరుగు పూర్తి చేసుకున్న ఫిలిప్ సాల్ట్.. మూడో పరుగు కోసం పరుగు స్టార్ట్ చేసాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న రాహుల్ స్టంప్స్‌కు కొట్టేయడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఇటువంటి రనౌట్ దృశ్యాలు మరిన్ని ఇటీవల చోటుచేసుకోవడం కొసమెరుపు.
పాకిస్తాన్ దేశవాలీ క్రికెట్‌లో కూడా ఇటీవల ఓ వింత రనౌట్ చేసుకుంది. కైడ్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో సియాల్‌కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ విచిత్రంగా రనౌటయ్యాడు. బౌలర్ రిటర్న్ త్రోను తప్పించుకోబోయి మొహమ్మద్ వాలీద్ గాల్లోకి ఎగరగా.. అదే సమయంలో బంతి వికెట్లను తాకింది. దీంతో వాలీద్ రనౌటయ్యాడు. ఈ వింత రనౌట్‌కు సంబంధించిన వీడియో కూడా మనకి సోషల్ మీడియాలో ఇప్పటికీ కనబడుతుంది. అదేవిధంగా కొన్నాళ్ల క్రితం కొంతమంది చిన్నపిల్లలు ఆడుకున్న క్రికెట్ మ్యాచ్‌లో ఇటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. బ్యాటర్‌ను రనౌట్ చేసేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు చేసిన పనితో జనాలు తెగ నవ్వుకున్నారు. నాలుగు సార్లు ట్రై చేసినా బ్యాటర్ ని ఔట్ చేయలేకపోయారు. చివరి సదరు బ్యాటర్ క్రీజును చేరుకోవడంతో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.