ఖమ్మం స్పోర్ట్స్ సర్కిల్స్‌లో నిన్న ఒక రేర్ సీన్ కనిపించింది. పిల్లలతో ఎగ్జామ్ హాల్‌కు వెళ్లే పేరెంట్స్‌ని చూసుంటాం.. జాబ్ ఇంటర్వ్యూలకు తోడుగా వెళ్లే వాళ్లని చూసుంటాం.. కానీ క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్ పట్టి ఆడుతూ కనిపించే తల్లిని ఎప్పుడైనా చూశారా? ఖమ్మంలో ఇలాంటి అరుదైన దృశ్యం చూసి అందరూ ఫిదా అయిపోయారు. పైన పిక్చర్‌లో కనిపిస్తున్న ఇద్దరూ ఎవరో కాదు.. అచ్చంగా తల్లికూతుళ్లే.

తల్లిదండ్రులు అంటే పిల్లల ఫ్యూచర్ కోసం ఏదైనా చేస్తారు. చదువులంటే ప్రోత్సహిస్తారు.. ఆటలంటే వెన్నుతట్టి ఎంకరేజ్ చేస్తారు. కానీ ఖమ్మంలో ఒక మదర్ మాత్రం తన డాటర్ డ్రీమ్‌ను తన డ్రీమ్‌గా మార్చేసుకుని క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్ ఝుళిపిస్తోంది. సీనియర్ ఉమెన్స్ క్రికెటర్‌గా నేషనల్ లెవెల్‌లో దుమ్మురేపిన పద్మ ఇప్పుడు తన గారాల పట్టి భవానిని ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా చూడాలని తెగ కలలు కంటోంది.

ఇంకా జస్ట్ ఎయిత్ క్లాస్ చదువుతున్న ఈ క్యూట్ గర్ల్ భవాని ఆల్రెడీ స్కూల్ గేమ్స్‌లో, క్రికెట్ అసోసియేషన్ టోర్నీల్లో పాల్గొని తన టాలెంట్ ఏంటో చూపిస్తోంది. కూతుర్ని ఎంకరేజ్ చేయడానికి మదర్ పద్మ ఏకంగా గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇద్దరూ కలిసి మ్యాచ్‌లు ఆడుతూ స్టేడియంలో ఉన్న వాళ్లందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు. అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ ఫ్యామిలీ కోదాడ టౌన్‌లో ఉంటోంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి మ్యాచ్ కోసం వచ్చిన ఈ బ్యూటిఫుల్ మదర్ అండ్ డాటర్ మూమెంట్‌ని ఒక మీడియా కెమెరా క్లిక్ చేసింది. అంతే.. ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఏదేమైనా ఇలాంటి తల్లిలు ఉండటం నిజంగా ప్రశంసనీయం. అందరూ కూడా తమ పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను ఇలాగే సపోర్ట్ చేస్తే వారు ఎలాంటి రంగాల్లోనైనా ఈజీగా దూసుకుపోగలరు. వీరిని చూసి మరింత మంది తల్లిదండ్రులు స్ఫూర్తి పొందాలని అందరూ కోరుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: