![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/will-they-change-pak-players-overaction-what-have-safari-players-doneed6b43b1-4faf-49d3-ac37-ac0e0d816a40-415x250.jpg)
ఈ క్రమంలో అద్బుతమైన షాట్స్ ఆడుతూ... సెంచరీ దిశగా దూసుకెళ్ళగా 29వ ఓవర్‌లో బావుమాను దురదృష్టం వెంటాండింది. ఆ ఓవర్ చివరి బంతికి రనౌట్ రూపంలో టెంబా పెవిలియన్‌కు చేరాడు. ఆ ఓవర్‌లో ఆఖరి బంతిని మహ్మద్ హస్నైన్ గుడ్ లెంగ్త్ డెలివరీగా బావుమాకి సాధించగా ఆ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. వెంటనే సింగిల్ కోసం బావుమా యత్నించగా.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మాథ్యూ బ్రీట్జ్కే సైతం పరుగు కోసం కొన్ని అడుగులు ముందుకు పరుగెత్తాడు. కానీ బ్రీట్జ్కే కొంచెం ముందుకు వచ్చి వెంటనే తన మనసును మార్చకుని నో అని కాల్ ఇచ్చాడు. అప్పటికే సగం దూరం పరిగెత్తిన బావుమా తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే చేయి దాటిపోయింది.
అప్పటికే బంతిని అందుకున్న సౌద్ షకీల్ స్ట్రయికర్ ఎండ్‌లో వికెట్లను గిరాటు వేయడం జరిగింది. ఈ క్రమంలో పాక్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ బోర్డర్ దాటాయి. పాక్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులామ్.. బావుమా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇవ్వడం అందరినీ అవాక్కయేలా చేసింది. ఆ తర్వాత సల్మాన్ అఘా, సౌద్ షకీల్ అదే రియాక్షన్ ఇవ్వగా, బావుమా మాత్రం అలా సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే ఇదే విషయంపై అంపైర్‌లు పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో చర్చించగా... అలా ప్రవర్తించడం సరికాదని రిజ్వాన్‌ను అంపైర్‌లు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడమో క్రీడాభిమానులు పాక్ పాక్ ప్లేయర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వారి ఓవరాక్షన్‌కు సఫారీలు బ్యాట్‌తో సమాధానం ఇవ్వడం కొసమెరుపు.