2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా యూఏఈ వెళ్తోంది. కానీ ఈసారి ప్లేయర్స్ భార్యలు, పిల్లలు ఎవ్వరూ వాళ్లతో వెళ్లడానికి వీల్లేదు. ఎందుకంటే బీసీసీఐ కొత్త రూల్స్ పెట్టింది మరి. ఈ రూల్స్ పేరు "టీమ్ ఇండియా పాలసీ డాక్యుమెంట్". ఇప్పటికే ఈ రూల్స్ ని స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు.

అసలు ఈ రూల్స్ ఎందుకు పెట్టారంటే.. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇండియా 3-1 తేడాతో ఓడిపోయింది. ఆ దెబ్బతో బీసీసీఐ కళ్లు తెరిచింది. వెంటనే జనవరి 2025 నుంచి ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఏ టూర్ అయినా సరే, ఈ రూల్స్ వర్తిస్తాయి.

రూల్స్ ఏంటంటే.. టూర్ 45 రోజులు కంటే తక్కువ ఉంటే ఫ్యామిలీస్‌కి పర్మిషన్ లేదు. ఒకవేళ టూర్ 45 రోజులు దాటితే.. అప్పుడు కూడా ఫ్యామిలీస్ కేవలం రెండు వారాలు మాత్రమే ప్లేయర్స్‌తో ఉండగలరు. అంతకుమించి ఉండాలంటే.. కోచ్, కెప్టెన్, జీఎం ఆపరేషన్స్ వీళ్లందరూ ఓకే చెప్పాలి. ఒకవేళ ఫ్యామిలీస్ ఎక్కువ రోజులు ఉంటే.. ఆ ఖర్చులన్నీ ప్లేయరే పెట్టుకోవాలి, బీసీసీఐ పైసా ఇవ్వదు. ఛాంపియన్స్ ట్రోఫీ 45 రోజులు కంటే తక్కువ కాబట్టి.. ఫ్యామిలీస్‌కి నో ఛాన్స్. కానీ జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల టూర్ మాత్రం 45 రోజులు దాటుతుంది. సో అప్పుడు ఫ్యామిలీస్ రెండు వారాలు ఉండొచ్చు.

ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ చూస్తే, దుబాయ్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో ఇండియా తలపడుతుంది. టోర్నీలో కొన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో కూడా జరుగుతాయి. ఇవి మాత్రమే కాదు.. బీసీసీఐ ఇంకా చాలా రూల్స్ పెట్టింది. ముఖ్యంగా  ప్లేయర్స్ పర్సనల్ కార్లలో తిరగకూడదు. టీమ్ అంతా కలిసి ఒకే వెహికల్‌లో వెళ్లాలి. ఇంగ్లాండ్‌తో జరిగిన రీసెంట్ టీ20, వన్డే సిరీస్‌లలో ఈ రూల్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యారు.

ప్లేయర్స్ తప్పకుండా డొమెస్టిక్ మ్యాచులు ఆడాలి. రీసెంట్‌గా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే ముంబై టీమ్ తరపున ఆడారు. కేఎల్ రాహుల్ (కర్ణాటక), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (ఢిల్లీ) కూడా డొమెస్టిక్ క్రికెట్‌లో కనిపించారు.

ఈ కొత్త రూల్స్‌తో బీసీసీఐ ఏం చేయాలనుకుంటోంది అంటే.. ప్లేయర్స్‌లో డిసిప్లిన్ పెంచడం, టీమ్ బాండింగ్ పెంచడం, డొమెస్టిక్ క్రికెట్‌కు కమిట్‌మెంట్ పెంచడం, ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రూల్స్ ఎలా వర్క్ అవుట్ అవుతాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: