![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/kohli-5df629e9-e818-4da0-b3f6-3d6120ecd578-415x250.jpg)
అవును, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6000 పరుగుల మైలురాయిని అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో 123 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించి హషీమ్ ఆమ్లాని సమం చేశాడు. ఇక టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి 136 ఇన్నింగ్స్‌లలో 6000 పరుగులు చేయగా.. బాబర్ తక్కువ ఇన్నింగ్స్‌లలోనే రికార్డ్ ఛేదించి, ఔరా అనిపించాడు. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ 139 ఇన్నింగ్స్‌లలో, శిఖర్ ధావన్ 140 ఇన్నింగ్స్‌లలో 6000 పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి విదితమే.
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రను చూసుకుంటే సయ్యద్ అన్వర్ 150 ఇన్నింగ్స్‌లలో 6000 పరుగులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 1992లో సయ్యద్ అన్వర్ ఈ ఫీట్ అందుకోగా ఆ తర్వాత అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇపుడు బాబర్ ఆజామ్ నిలిచాడు. మరోవైపు వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ రికార్డు కూడా బాబర్ ఆజామ్ పేరిటే ఉండడం విశేషం. బాబర్ కేవలం 97 మ్యాచ్‌లలోనే 5000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 97 మ్యాచ్‌లలో 5000 చేసిన బాబర్‌కి మరో వెయ్యి పరుగులు చేయడానికి 26 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది. 2023 వన్డే వరల్డ్‌కప్ నుంచి బాబర్ ఆజామ్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సంగతి విదితమే. అయినా ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజామ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ ఉన్నాడు. ఫామ్‌లో లేకపోయినా 55.73 యావరేజ్‌తో 6 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం అంటున్నారు విశ్లేషకులు.