![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/-champions-trophy34527160-940b-4b88-b7ac-26e3f560c94c-415x250.jpg)
అవును, ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఇలా జరగడం బాధాకరం. మొదట గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం జరగాల్సి వచ్చింది. దాంతో కెప్టెన్సీని స్టీవ్ స్మిత్ కు అప్పగించడం జరిగింది. అదంతా ఒకెత్తయితే ఇప్పుడు మిచెల్ స్టార్క్ కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. దాంతో ఆటోమెటిగ్గానే అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గాయాల కారణంగా జట్టు దారుణంగా బలహీనపడింది. కట్ చేస్తే తాజాగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శ్రీలంకను 2-0 తేడాతో ఓడించింది. వన్డే సిరీస్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనే ఉంటుందని భావించారు. కానీ, తొలి మ్యాచ్‌లోనే శ్రీలంక టార్గెట్ పెట్టిన 214 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించలేకపోయింది.
ఈ మ్యాచ్ విషయానికొస్తే... శ్రీలంక జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని బరిలోకి దిగగా, ఆ జట్టు బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పర్చారు. టాప్ నలుగురు బ్యాటర్లు కేవలం 31 పరుగులకే ఔట్ కావడంతో కెప్టెన్ అసలంకా ఎదురుదాడి చేసి 126 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక జట్టు 46 ఓవర్లలో 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ అత్తెసరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. మాథ్యూ షార్ట్ పాపం ఖాతా కూడా తెరవలేకపోవడం బాధాకరం. జాక్ ఫ్రేజర్ మెక్‌గుయిర్క్ 2 పరుగులకే చేతులెత్తేశాడు. కూపర్ కొన్నోలీ 3 పరుగులకు, స్టీవ్ స్మిత్ 12 పరుగులకు, మార్నస్ లబుషేన్ 15 పరుగులకు మాత్రమే పరిమితం అయ్యారు. అలెక్స్ కారీ, ఆరోన్ హార్డీ కాసేపు పోరాడినా ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. కట్ చేస్తే... శ్రీలంక 49 పరుగుల తేడాతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది.
ఇరు జట్ల విషయానికొస్తే...
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, కూపర్ కొన్నోలీ, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), ఆరోన్ హార్డీ, షాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిండు మెండిస్, చరిత్ అస్లాంక (కెప్టెన్), జెనిత్ లియానాగే, దునిత్ వెల్లేజ్, వనిండు హసరంగా, మహేష్ థెక్షణ, ఎషాన్ మలింగ, అసిత ఫెర్నాండో