టీమ్ ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని గురించి తెలియజేయాల్సిన పనిలేదు. టీమిండియా కు ఎన్నో సేవలు అందించిన ధోని ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ని బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. ఐపీఎల్ ఆడుతూ కేవలం అభిమానులను మాత్రం ఖుషి చేస్తున్న ధోని తాజాగా మహేంద్రసింగ్ ధోని కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అయితే ఈ ఫోటోలు సడన్గా చూస్తే ధోని ని గుర్తుపట్టడం చాలా కష్టంగా కనిపిస్తోందంటూ పలువురు నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.



తన భార్యతో కలిసి ఒక ప్రైవేట్ ఈవెంట్ కు హాజరైన ధోని ట్రెడిషనల్ లుక్ లో దుస్తులు వేసుకొని మరి కనిపించారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక ప్రైవేట్ ఈవెంట్ కు ధోని దంపతులు హాజరైనట్లు సమాచారం. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ధోని క్లీన్ సేవ్ చేసుకొని తన ముఖంలో ఏదో మార్పు కనిపిస్తున్నట్లుగా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ అవ్వడమే కాకుండా.. ధోని పక్కన సాక్షి ఉన్నది అసలు అక్కడ ధోని నేనా ? లేదా ఏదైనా డూప అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మరి కొంతమంది ధోని సర్జరీ చేయించుకున్నారా అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి ఫోటోలు చూసిన నేటిజెన్స్ సైతం ధోని ఫ్యాన్స్ పలు రకాలుగా రచ్చ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోటోలు కూడా ధోని అనే ట్విట్టర్ పేరుతోనే ట్రెండ్ అవుతున్నాయి. ధోని సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి తన బ్యానర్ మీద పలు చిత్రాలను నటింపజేసేలా చేస్తూ ఉన్నారు. ఇక ఐపీఎల్ త్వరలోనే సిద్ధం కాబోతున్న సందర్భంగా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ధోని చివరి మ్యాచ్ ఇదే అన్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: