ఐపీఎల్ 2025 టోర్నీకి ఇంకో నెల రోజులే టైమ్ ఉంది. దీంతో అన్ని జట్లు ప్లాన్స్ వేసుకోవడంలో బిజీగా ఉన్నాయి. చాలా టీమ్స్ పాత కెప్టెన్లనే కంటిన్యూ చేస్తున్నా.. కొన్ని జట్లు మాత్రం కెప్టెన్సీ మార్పులు చేశాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ఒక బిగ్ అనౌన్స్‌మెంట్‌ చేసింది. రజత్ పటిదార్‌ను కొత్త కెప్టెన్‌గా ఫిబ్రవరి 13న అనౌన్స్ చేసింది. దీంతో RCB ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) మాత్రం ఇంకా కొత్త కెప్టెన్ కోసం వెతుకుతూనే ఉంది. లాస్ట్ టైమ్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్‌తో కేకేఆర్ తెగదెంపులు చేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. నిజానికి లాస్ట్ సీజన్లో శ్రేయాస్ కెప్టెన్సీలోనే కేకేఆర్ కప్పు కొట్టింది. కానీ, ఈసారి వేలంలో అతన్ని పంజాబ్ కింగ్స్ కొనేసింది. ఇప్పుడు కేకేఆర్ టీమ్ దగ్గర ఇద్దరు స్ట్రాంగ్ కెప్టెన్సీ ఆప్షన్స్ ఉన్నారు.

వాళ్లలో ఒకరు వెంకటేష్ అయ్యర్. అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్ ఇతడు. పైగా లీడర్ అయ్యే క్వాలిటీస్ కూడా ఉన్నాయంటున్నారు. మరొకరు అజింక్య రహానే. సీనియర్ ప్లేయర్, కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కేకేఆర్ ఇంకా ఎవరిని ఫైనల్ చేస్తుందో చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కూడా ఇంకా కెప్టెన్ ఎవరో చెప్పలేదు. అక్షర్ పటేల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ, డీసీ టీమ్ ఈసారి వేలంలో కేఎల్ రాహుల్‌ను కూడా కొన్నది. రాహుల్‌ను కెప్టెన్ చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఫ్రాంచైజీ మాత్రం ఇంకా ఏం చెప్పలేదు.

ఐపీఎల్ 2025 - ఇప్పటివరకు కన్ఫమ్ అయిన కెప్టెన్స్ లిస్ట్ ఇదిగో,


ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా,
చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్,
రాజస్థాన్ రాయల్స్ – సంజూ శాంసన్,
గుజరాత్ టైటాన్స్ – శుభ్మన్ గిల్,
సన్రైజర్స్ హైదరాబాద్ – పాట్ కమిన్స్,

పంజాబ్ కింగ్స్ – శ్రేయాస్ అయ్యర్,
లక్నో సూపర్ జెయింట్స్ – రిషబ్ పంత్,
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రజత్ పటిదార్

ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి స్టార్ట్ అవుతుందని అంటున్నారు. కాబట్టి, కేకేఆర్, డీసీ టీమ్స్ కూడా త్వరలోనే కెప్టెన్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు టీమ్స్‌ను ఎవరు లీడ్ చేస్తారో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: