
షెడ్యూల్ చూస్తే ఉప్పల్‌కు దగ్గరలో ఉన్నవారు పండగ చేసుకోవచ్చని అనిపిస్తుంది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్యాన్స్ మాత్రం లోలోపల కుమిలిపోతున్నారు. కారణం లేకపోలేదు. వేదిక మనదే అయినా, అసలు సిసలైన మజా ఇచ్చే మ్యాచ్‌లు మిస్సయ్యేలా ఉన్నాయి. విరాట్ కోహ్లీ, ధోనీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు లీగ్ దశలో హైదరాబాద్‌కు రావడం లేదు. ఉప్పల్‌లో సందడి మామూలుగా ఉండదు, కానీ ఈ రెండు జట్లు లేకపోవడంతో ఆ కిక్కే వేరప్ప అనుకునే ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ తప్పదు.
అయితే పూర్తిగా డీలా పడాల్సిన పనిలేదు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఉంది. ఏప్రిల్ 23న రోహిత్ శర్మ సేన హైదరాబాద్‌లో సందడి చేయనుంది. ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. ఇక క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు కూడా ఉప్పల్‌లోనే జరగనున్నాయి. అంటే ఒకవేళ SRH అద్భుతంగా ఆడి టాప్-2లో నిలిస్తే క్వాలిఫయర్‌లో RCB లేదా CSKతో తలపడే ఛాన్స్ లేకపోలేదు. అప్పుడు మాత్రం ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోవడం ఖాయం. మే 20, 21 తేదీల్లో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం నగరమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తుంది.
ఏదైమైనా ఉప్పల్‌లో క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరకడం మాత్రం గ్యారెంటీ. లీగ్ మ్యాచ్‌లు కొన్ని మిస్ అయినా, ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉండటం హైదరాబాద్ ఫ్యాన్స్‌కు మంచి కిక్కే ఇస్తుంది. ఇక స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ చేసే హంగామా చూడటానికి రెండు కళ్లూ చాలవు. వేచి చూడండి.. ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌లు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయో లేదో.