ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా జట్టు నేడు మొదటి మ్యాచ్ ఆడనుంది. దానికి దుబాయ్ వేదిక కానుండగా, భరత్ - బంగ్లాదేశ్ మధ్య గట్టి పోరు నడవనుంది. అయితే, దుబాయ్ పిచ్ గురించి క్రీడాభిమానులకు తెలిసే ఉంటుంది. దుబాయ్ పిచ్ ఎక్కువగా స్పినర్స్ కు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు జరిగే మ్యాచ్ లో కూడా దుబాయ్ పిచ్ స్పిన్నర్ల కు మాత్రమే అనుకూలిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇరు జట్లూ ఆల్ రౌండర్లతో కలిపి ముగ్గురు చొప్పున స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ పిచ్ పై బ్యాటింగ్ అనేది అనుకున్నంత తేలిక విషయం కాదు.. అలా అని మరీ కష్టంగా కూడా ఉండకపోవచ్చు.

ఈ నేపథ్యంలో బుధవారం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడగా ఓ ఆసక్తికరమైన ప్రశ్నను మీడియా జర్నలిస్టులు అడగడం జరిగింది. విషయం ఏమిటంటే? భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు? అని ఓ జర్నలిస్ట్ అడగగా.. రోహిత్ తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా అదే అనుమానాన్ని కొందరు మాజీ క్రికెటర్లు సైతం విమర్శించడంతో అదే విషయాన్ని మీడియా ప్రతినిధులు రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీంతో రోహిత్ దానికి సమాధానం ఇస్తూ... "తమ బలాలకు అనుగుణంగానే జట్టును ఎంపిక చేయడం జరిగింది. జట్టులో ఉన్నది 5 స్పిన్నర్లు అనే అంశాన్ని నేను ఎప్పటికీ పరిగణలోకి తీసుకోను. జట్టులో ఉన్నది కేవలం ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే. మరో ముగ్గురు ఆల్ రౌండర్లు. వారిని మేము స్పిన్నర్లుగా చూడటం లేదు. ఎందుకంటే వారు బ్యాట్ తో పాటుగా బాల్ తో కూడా రాణించగలరు." అని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా రోహిత్ ఇంకా మాట్లాడుతూ... మేము ప్రస్తుతం మా బలాలాపైనే దృష్టిని కేంద్రీకరించాం. అందుకు తగ్గట్టుగానే జట్టును యుద్ధానికి సన్నద్ధం చేసాము. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మా జట్టుకు విభిన్నమైన డైమెన్షన్ అందిస్తారు. వారితో మా బ్యాటింగ్ బలం మెండుగా పెరుగుతుంది. అందుకే మేం బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను మాత్రమే ఎంచుకున్నాం! అంటూ రోహిత్ సమాధానం ఇవ్వడం జరిగింది. దాంతో ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు రోహిత్ సమాధానం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: