పరుగుల రారాజు.. రికార్డుల వేటగాడు.. విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సంచలనం. బ్యాట్ పట్టుకుంటే బౌలర్లకు చుక్కలు చూపించాల్సిందే. అలాంటి వీరుడు ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం సెంచరీ కొట్టలేదంటే నమ్ముతారా? అవును, 13 మ్యాచ్‌లు ఆడి, 88.16 సగటుతో 529 పరుగులు పిండుకున్నా.. హాఫ్ సెంచరీలు ఐదు కొట్టినా.. సెంచరీ మాత్రం ఇంకా మిస్సింగ్.

ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డుల్లో సెంచరీ అనే ముద్ర లేకపోవడంతో అభిమానులు కాస్త డీలా పడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. దాంతో ఫ్యాన్స్ అందరికీ పూనకం వచ్చేసింది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ సెంచరీ గ్యారెంటీ అని ఫిక్సయిపోయారు.

విరాట్ కోహ్లీ వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఇంకో 37 పరుగులు చేస్తే చాలు.. చరిత్ర సృష్టించినట్టే. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా విరాట్ పేరు రికార్డుల్లోకి ఎక్కేస్తుంది. చూస్తుంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డుల మోత మోగడం ఖాయం.

విరాట్ ఇప్పుడున్న ఫామ్ చూస్తుంటే సెంచరీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అభిమానులైతే కళ్లు మూసుకుని నమ్మేస్తున్నారు. ఈ టోర్నీలో విరాట్ తన కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో అదరగొడతాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. విరాట్ విశ్వరూపం ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

మరోవైపు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మkuw సిక్స్‌లు కొట్టడంలో, బౌండరీలు బాదడంలో రోహిత్‌కు సాటి ఎవరూ లేరు. అలాంటి రోహిత్ ఇప్పుడు వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించడానికి రెడీ అయ్యాడు. ఇంకో 12 పరుగులు చేస్తే చాలు.. 11 వేల పరుగుల క్లబ్‌లో చేరిపోతాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన పదో బ్యాటర్‌గా, ఇండియా నుంచి నాలుగో క్రికెటర్‌గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు.

ఇక మహ్మద్ షమీ ఇప్పుడు వన్డేల్లో 200 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఇంకో 3 వికెట్లు పడితే చాలు.. డబుల్ సెంచరీ వికెట్ల క్లబ్‌లో షమీ పేరు మారుమోగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: