క్రికెట్ స్టార్ యుజ్వేంద్ర చాహల్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ‌ల జంట ఇకపై కలిసి ఉండట్లేదు. అవును, షాకింగ్ న్యూస్ ఏంటంటే వీళ్లిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ విడిపోతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు, ఇద్దరూ సీక్రెట్ పోస్టులు పెట్టి మరీ హింట్స్ ఇచ్చారు. కానీ అసలు రీజన్ మాత్రం ఎవరికీ చెప్పలేదు.

గురువారం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీళ్లిద్దరి ఫైనల్ హియరింగ్ జరిగింది. చాహల్, ధనశ్రీ ఇద్దరూ కోర్టుకి హాజరయ్యారు. లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. విడాకులు మంజూరు చేయడానికి ముందు జడ్జి వాళ్లకి ఒక కౌన్సిలింగ్ సెషన్ కూడా పెట్టారంట. దాదాపు 45 నిమిషాలు కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత, ఇద్దరూ కలిసి విడాకులు తీసుకోవడానికి ఒప్పుకున్నారని జడ్జికి తెలిపారు.

విషయం ఏంటంటే, చాహల్, ధనశ్రీ గత 18 నెలలుగా సెపరేట్ గా ఉంటున్నారట. విడాకులకి కారణం అడిగితే 'మేం ఒకరికొకరు సెట్ అవ్వలేదు' అని చెప్పారంట. అదన్నమాట అసలు మ్యాటర్. కేసు మొత్తం చూశాక, జడ్జి గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో విడాకులు మంజూరు చేశారు.

ఫైనల్ హియరింగ్ ముందు చాహల్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 'దేవుడు నన్ను లెక్కలేనన్నిసార్లు కాపాడాడు' అని రాసుకొచ్చాడు. అటు ధనశ్రీ కూడా ఇన్‌స్టాలో దేవుడి మీద నమ్మకం గురించి ఒక మెసేజ్ పెట్టింది. 'దేవుడు మన కష్టాలను కూడా ఆశీర్వాదాలుగా మార్చగలడు' అని తన ఫీలింగ్స్ షేర్ చేసింది.

ఈ పోస్టులలో విడాకుల గురించి డైరెక్ట్‌గా చెప్పకపోయినా, వాళ్ల మాటలు మాత్రం వాళ్లిద్దరూ ఎంతో బాధలో ఉన్నారని, జీవితంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయని చెప్పకనే చెప్పాయి. ఏదేమైనా, చాహల్-ధనశ్రీ జంట విడిపోవడంతో ఒక అందమైన ప్రేమకథ ముగిసింది. కానీ వీళ్లిద్దరూ చాలా సైలెంట్‌గా, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ విషయాన్ని హ్యాండిల్ చేయడం నిజంగా గ్రేట్.


మరింత సమాచారం తెలుసుకోండి: