
అందువల్లే సినిమా విడుదల అయ్యేందుకు మరొక సంవత్సరం పట్టవచ్చు అంటూ వెల్లడించారు. అయితే ఈ వార్త వెలువడిన వెంటనే అభిమానులలో ఆనందం కనిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా గంగోలి పాత్ర ఎవరు పోషిస్తారనే విషయంపై కూడా ఎక్సైటింగ్ గా ఉన్నారు. గతంలో ఎంతో మంది పేర్లు వినిపించినా చివరికి రాజ్ కుమార్ రావు పేరు గంగోలి నోట నుంచి రావడంతో ఫిక్స్ అయ్యారు గత ఏడాది స్ర్తీ 2 సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటించారు.
అంతకుముందు ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుపొందినటువంటి వారిలో శ్రీకాంత్ బొల్లా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఒక చిత్రంలో కూడా రాజకుమార్ రావు నటించారు. ఈ నేపథ్యంలోనే సౌరవ్ గంగోలి బయోపిక్ ఆధారం ఎంపిక చేశారు అనే విషయం తెలిసి అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. మరి సౌరవ్ గంగూలీ జీవితంలో జరిగిన లవ్ విషాద సంఘటనలు అన్నీ కూడా ఈ బయోపిక్ లో కనిపిస్తాయా లేవా అనే విషయం చూడాలి. మొత్తానికి అటు క్రికెట్ అభిమానులను కూడా ఈ విషయం మరింత ఆనందపరిచేలా చేస్తుంది. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్ ఇతరత్రా క్రికెటర్లకు సంబంధించి బయోపిక్ కూడా విడుదలయ్యాయి.