
వివరాల్లోకి వెళితే.. 2021లో సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ అనే సంస్థ గుజరాత్ టీమ్‌ను ఏకంగా రూ. 5,625 కోట్లకు కొనుక్కుంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ నుండి 67% వాటాను టొరెంట్ గ్రూప్ కొనుగోలు చేస్తోందని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయట.
ఇంకాస్త క్లారిటీ కావాలంటే.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ వాళ్ళు ఓకే అంటే.. ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ అయ్యేలోపు అంటే మార్చి 21 కల్లా టొరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేపడుతుంది. అయితే ఈ డీల్ ఎంతకు కుదిరింది అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.
"టొరెంట్ గ్రూప్‌తో 67% వాటా అమ్మకం గురించిన చర్చలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఫిబ్రవరి 2025తో సీవీసీ క్యాపిటల్ ఒంటరిగా ఓనర్‌గా ఉండే లాక్-ఇన్ పీరియడ్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు తమ వాటాను అమ్మేసుకోవచ్చు" అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
టొరెంట్ గ్రూప్ పేరు ఫార్మా రంగంలో బాగా వినిపిస్తుంది. దాదాపు రూ.41,000 కోట్ల విలువైన కంపెనీ ఇది. 2021లో బీసీసీఐ కొత్తగా రెండు టీమ్‌ల కోసం బిడ్లు పిలిచినప్పుడు టొరెంట్ గ్రూప్ కూడా రేసులో నిలిచింది. వాళ్ల అనుబంధ సంస్థ టొరెంట్ స్పోర్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అహ్మదాబాద్ టీమ్ కోసం (రూ.4,653 కోట్లు), లక్నో టీమ్ కోసం (రూ.4,356 కోట్లు) బిడ్ వేసింది. అంతేకాదు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో కూడా ఒక టీమ్‌ను కొనేందుకు ట్రై చేసింది కానీ అప్పుడు మాత్రం సక్సెస్ కాలేకపోయింది.
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే హిస్టరీ క్రియేట్ చేసింది. 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఫస్ట్ సీజన్‌లోనే టైటిల్ కొట్టేసింది. 2023లో కూడా ఫైనల్ వరకు దూసుకెళ్లింది కానీ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఓడిపోయింది. ఇప్పుడు టొరెంట్ గ్రూప్ ఎంట్రీతో గుజరాత్ టైటాన్స్ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతోంది. చూడాలి మరి ఈ కొత్త యజమాని టీమ్‌ను ఎలా ముందుకు నడిపిస్తారో.