- ( స్పోర్ట్స్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఛాపింయ‌న్స్ ట్రోపీలో ఇప్ప‌టికే ఓ విజ‌యం సాధించి మంచి ఊపు మీద ఉన్న న్యూజిలాండ్ జ‌ట్టు సోమవారం బంగ్లాదేశ్ లో తెలపడ నుంది. తొలి మ్యాచ్లో 60 పరుగులు తేడాతో ఆదిత్య పాకిస్తాన్ జట్టును చిత్తు చేసిన కీవీస్ రెట్టించిన విశ్వాసంతో ఉంది. ఇప్పటికే మంచి రన్ రేట్ ( 1.200 + ) కలిగి ఉన్న కీవీస్ జట్టు గ్రూపులో రెండో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో చావు రేవో తేల్చు కోవాలసిన పరిస్థితి. తొలి మ్యాచ్లో భారత్ జ‌ట్టు చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన ఆ జట్టు గ్రూపులో మూడో స్థానంలో ఉంది. బలంగా ఉన్న కీవీఎస్ జట్టును అడ్డుకోవడం బలహీనంగా ఉన్న బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద సవాలు అని చెప్పాలి. అయితే గత ఛాంపియన్ ట్రోపీ మ్యాచ్లో న్యూజిలాండ్ ను బంగ్లాదేశ్ ఓడించింది.


ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోతే గ్రూప్ లో సెమిస్ బెర్త్ లు పూర్తిగా తేలిపోతాయి. అప్పుడు భారత్ - న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకుంటాయి. బంగ్లాదేశ్ .. పాకిస్తాన్ జ‌ట్లు ఇంటి ముఖం పడతాయి. గ్రూప్లో ఆ తర్వాత భారత్ - న్యూజిలాండ్ జ‌ట్ల మధ్య జరిగే మ్యాచ్ తో పాటు బంగ్లాదేశ్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో రెండు నామమాత్రంగా జరుగుతాయి. ఒకవేళ అనూహ్యంగా బంగ్లాదేశ్ గెలిస్తే అప్పుడు భారత్ సెమీ ఫైనల్ కు వెళుతుంది. కీవిస్ తో పాటు పాకిస్తాన్ .. బంగ్లాదేశ్ కూడా సెమీఫైనల్ రేసు లో ఉంటాయి. మిగిలిన రెండు మ్యాచ్లు కూడా కీలకమే అవుతాయి. ఏదేమైనా ఈ రోజు మ్యాచ్ ఫ‌లితం తో గ్రూప్ ఏ లో సెమీ ఫైనల్ బెర్తుల విష‌యం లో ఓ క్లారిటీ అయితే వ‌చ్చేలా ఉండ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: