
ఈ ఘటనపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ చేసింది అనవసరమైన చర్య అని, ఇది వికెట్ కోల్పోయేలా చేసేదని గట్టిగా హెచ్చరించాడు. ఇలాంటి పనులు మళ్లీ చేయొద్దని సూచించాడు.
అసలు ఎంసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. ఫీల్డింగ్ చేస్తున్న జట్టును ఆటగాడు కావాలని అడ్డుకుంటే లేదా వారి దృష్టిని మరల్చితే అది 'ఫీల్డింగ్‌కు అడ్డుపడటం' కిందకే వస్తుంది. బంతి ఆడుతున్న సమయంలో బ్యాటర్ బ్యాట్ లేకుండా చేత్తో బంతిని కొట్టినా కూడా అవుట్ ఇవ్వొచ్చు. నో బాల్ వేసినా కూడా ఈ రూల్ వర్తిస్తుంది.
ఇదిలా ఉండగా, కోహ్లీ మాత్రం అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. భారత్ 242 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో సెమీ-ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. కోహ్లీ సెంచరీతో మెరిసినా, అతని నిర్లక్ష్యపు చర్య మాత్రం చర్చనీయాంశంగా మారింది. గవాస్కర్ విమర్శలు సీనియర్ ఆటగాడైన కోహ్లీ కూడా రూల్స్‌ను గుర్తుంచుకోవాలని చెప్పకనే చెబుతున్నాయి.
ఏది ఏమైనా అతడు అవుట్ కాలేదు. అది ఇండియా అదృష్టమని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇండియా ఓడిపోయి ఐఐటీఎన్ బాబా చెప్పిందే నిజమై ఉండేది. దాంతో ఆయనకు పేరు, టీమిండియా కి చెడ్డ పేరు వచ్చి ఉండేది. కోహ్లీ కొంచెం అత్యుత్సాహాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.