చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. తెరపైకి కొత్త సమస్య వచ్చి పడింది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును ఈసారి పాకిస్తాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా... డిమాండ్ పెట్టిన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ దేశంలో టీమిండియా పర్యటిస్తే కచ్చితంగా ఉగ్రవాదులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే... దుబాయ్ లో టీమిండియా మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే... టీమిండియా జాగ్రత్త పడ్డది కాబట్టి బయటపడింది.

 కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం మిగతా ఎనిమిది జట్లు పాకిస్తాన్ కు వెళ్లడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో.. పాకిస్తాన్  ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ వీక్షించేందుకు పాకిస్తాన్ దేశానికి వెళ్లిన  విదేశీ క్రికెట్ అభిమానులను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాదులు కుట్రకు తెర లేపారట. మ్యాచ్ చూసేందుకు వచ్చిన విదేశీ క్రికెట్ అభిమానులను కిడ్నాప్ చేసి... ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును రద్దు చేసేలా కుట్రలు పన్నుతున్నారట పాకిస్తాన్ ఉగ్రవాదులు.

 ఐ ఎస్ ఐ ఎస్ ఐ, బలుచిస్తాన్, లాంటి ఉగ్రవాద సంస్థలు... ఈ కుట్రకు తెరలేపాయట. దీనికి సంబంధించిన వార్త.. పాకిస్తాన్ దేశ ఇంటెలిజెంట్స్ కు అందింది. దీంతో పాకిస్తాన్ సర్కార్ అలర్ట్ అయింది.  ఈ తరుణంలోనే పాకిస్తాన్ దేశంలో... భద్రతను కట్టుదిట్టం చేసింది పాకిస్తాన్ ఆర్మీ. చాంపియన్స్ ట్రోఫీ  2025 టోర్నమెంట్ చూసేందుకు వస్తున్న క్రికెట్ అభిమానులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకునేందుకు... గ్రౌండ్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది.

 అలాగే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ చూసేందుకు వచ్చిన విదేశీ క్రికెట్ అభిమానుల లిస్టును కూడా తయారు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆ క్రికెట్ అభిమానులు ఎక్కడ ఉన్నారు..? ఏ హోటల్ లో దిగారు? ఎటు వెళ్తున్నారు అనే దానిపైన ఆరా తీస్తున్నారు అధికారులు. పాకిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయి ఏదైనా చేస్తే... చాంపియన్స్ ట్రోఫీ  2025 టోర్నమెంట్ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని... ప్రభుత్వం కూడా హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: